నా పేరు ‘పుష్ప రాజ్’ అబ్బా..

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు..

నా పేరు ‘పుష్ప రాజ్’ అబ్బా..

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ ఫిల్మ్‌ టైటిల్, ఫస్ట్ లుక్ బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త‌ంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘పుష్ప’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అల్లు అర్జున్ గడ్డంతో మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ‘పుష్ప’లో పుష్పరాజ్ క్యారెక్టర్ చేస్తున్నాడు బన్నీ. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో రూపొందనుందీ చిత్రం. చిత్తూరు జిల్లాలోని స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు.

‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ బాగా టైమ్ తీసుకుని ‘పుష్ప’ స్క్రిప్ట్ రెడీ చేసాడని, సినిమా ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని సమాచారం. రష్మికా కథానాయికగా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో సినీ వర్గాల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం విశేషం. గతంలో అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ కాంబినేషన్‌లో ‘ఆర్య’, ‘ఆర్య 2’ వంటి మ్యూజికల్ హిట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే బన్నీ, దేవి కాంబినేషన్‌లో వచ్చిన ‘బన్నీ’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘డీజే’ సినిమాలు మ్యూజికల్ హిట్స్‌‌గా నిలిచాయి. మరోసారి వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మ్యూజిక్ లవర్స్‌తో పాటు డాన్స్ లవర్స్‌ను కూడా ఆకట్టుకోబోతోంది.

Read Also : ‘ఆర్ఆర్ఆర్’ పేరడి.. ఆర్.నారాయణ మూర్తిలా అన్నీ నువ్వే చేసెయ్..

సాంకేతిక నిపుణులు :
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సహ నిర్మాత: ముత్తంశెట్టి మీడియా
డైరెక్టర్: సుకుమార్
ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, రవి శంకర్.వై
కెమెరామెన్: మిరోస్లోవ్ కుబ బ్రోజెక్
మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్
ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్
ఆర్ట్ డైరెక్టర్: ఎస్.రామకృష్ణ , మౌనిక
సి.ఈ. ఓ: చెర్రీ
లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కె.వి.వి.