రాజమౌళి నీ సినిమాలన్నీ కాపీనే కదా! పెద్ద కాపీ మాస్టర్.. ప్రశాంత్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్.. ఎదగాల్సిన వాడికి Extraలు అవసరమా?

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్, దర్శకధీరుడు రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు..

రాజమౌళి నీ సినిమాలన్నీ కాపీనే కదా! పెద్ద కాపీ మాస్టర్.. ప్రశాంత్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్.. ఎదగాల్సిన వాడికి Extraలు అవసరమా?

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్, దర్శకధీరుడు రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు..

దర్శకధీరుడు రాజమౌళి గురించి తెలియని వారెవరూ ఉండరు. ‘బాహుబలి’ సిరీస్ సినిమాలతో తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లి, తెలుగు సినిమా గురించి ప్రపంచ సినీ ప్రేక్షకులు, అభిమానులు మాట్లాడుకునేలా చేశాడు. అటువంటి రాజమౌళిపై తాజాగా ఓ యువ దర్శకుడు సెన్సేషనల్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. జక్కన్న సినిమాలన్నీ కాపీనే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు టాలీవుడ్ డైరెక్టర్. వివరాళ్లోకి వెళ్తే.. రాజమౌళి ఇటీవల ఆస్కార్ విన్నింగ్ మూవీ ‘పారాసైట్‌’ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా చూస్తుంటే తనకు నిద్ర వచ్చేసిందని.. అసలు నచ్చలేదని.. చూస్తూ చూస్తూ మధ్యలోనే పడుకున్నానని.. ఆ తర్వాత తన భార్య కథ చెప్పినా కూడా పెద్దగా నచ్చలేదని.. అయితే తనకు నచ్చకపోయినంత మాత్రానా అది గొప్ప సినిమా కాకుండాపోదని చెప్పాడు. దాంతో ఇది కాస్త వివాదం అయింది.

Director Prashanth Kumar Sentational Comments on Rajamouli

తాజాగా ప్రశాంత్ అనే కుర్ర దర్శకుడు రాజమౌళిని దారుణంగా విమర్శిస్తూ ట్వీట్ చేశాడు. ఇతగాడు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా ‘మిఠాయి’ అనే సినిమా తెరకెక్కించాడు. ఆ సినిమా రిజల్ట్ అందరికీ తెలిసిందే. ‘‘పారాసైట్ అనేది అద్భుతమైన ఒరిజినాలిటీ ఉన్న సినిమా.. దీన్ని ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు కూడా ప్రశింసించారు.. సినిమా అనే అడ్డుగోడలు కూల్చేసింది ఇది.. కానీ ‘బాహుబలి’ చిత్రం గురించి ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు మాట్లాడినట్లు నేనెక్కడా వినలేదు.. చూడలేదు.. ఒరిజినాలిటీ గురించి మాట్లాడుకుంటే మీ ‘సై’ సినిమాలో ఓ సీన్ మొత్తాన్ని కాపీ చేశారు.. మరికొన్ని సినిమాలు కూడా కాపీలే.. అద్భుతమైన ‘పారాసైట్’ గురించి ఇలాంటి కామెంట్స్ చేయడం మీకు తగదు..’’ అంటూ ప్రశాంత్ కుమార్, జక్కన్నను విమర్శించాడు. కేవలం పబ్లిసిటీ కోసమే ప్రశాంత్ ఇలా కామెంట్స్ చేస్తున్నాడని, మనకి నచ్చింది కాదా అని అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు కదా.. ఎవరి అభిప్రాయం వారిది..ఎదగాల్సిన వాడివి.. నీకివన్నీ అవసరమా అంటూ ప్రశాంత్‌కు కొందరు సలహా ఇస్తున్నారు.