Heroines : వీళ్ళు పెళ్లిళ్లు చేసుకోరా?? 30 దాటి ఏళ్ళు గడుస్తున్నా పెళ్లి మాట ఎత్తని హీరోయిన్స్.. | 30 plus heroines say no to marriage

Heroines : వీళ్ళు పెళ్లిళ్లు చేసుకోరా?? 30 దాటి ఏళ్ళు గడుస్తున్నా పెళ్లి మాట ఎత్తని హీరోయిన్స్..

30 క్రాస్ చేసినా ఇంకా పెళ్లి ఊసెత్తట్లేదు సౌత్ సీనియర్ హీరోయిన్స్. శ్రేయ, కాజల్, నయనతార లాంటి సీనియర్స్ అడుగు జాడల్లో నడిచేందుకు ఎవ్వరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఏ వయసులో జరగాల్సిన..............

Heroines : వీళ్ళు పెళ్లిళ్లు చేసుకోరా?? 30 దాటి ఏళ్ళు గడుస్తున్నా పెళ్లి మాట ఎత్తని హీరోయిన్స్..

Heroines :  30 క్రాస్ చేసినా ఇంకా పెళ్లి ఊసెత్తట్లేదు సౌత్ సీనియర్ హీరోయిన్స్. శ్రేయ, కాజల్, నయనతార లాంటి సీనియర్స్ అడుగు జాడల్లో నడిచేందుకు ఎవ్వరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలనేది పాత ముచ్చట. మాకు నచ్చినప్పుడు పెళ్లిపీటలెక్కడనమే నయా ట్రెండ్ అంటున్నారు ఈ ముదురు భామలు.

అప్పుడు… ఇప్పుడూ అని సాగదీసి… ఊరించి, ఉడికించి మొత్తానికి పెళ్లి పీటలెక్కేసింది నయనతార. తనకు అన్ని విధాలా సెట్ అయినట్టు చెప్తోన్న విఘ్నేశ్ శివన్ తో కొన్ని సంవత్సరాల డేటింగ్ తర్వాత వివాహం చేసుకుంది. 37 ఏళ్ల వయసులో పెళ్లి ముచ్చట తీర్చుకుంది నయన్. నయన్ తర్వాత ఇప్పుడిక అందరి చూపు మోస్ట్ సీనియర్స్ పై పడింది.

40 ఏళ్ల వయసులో పడింది స్వీటి శెట్టి. అయినా పెళ్లి ప్రస్తావన లేదు. బాహుబలి 2 తర్వాత అన్నారు. భాగమతి తర్వాత అన్నారు. ఇప్పుడు నవీన్ పొలిశెట్టితో సినిమా కూడా చేస్తోంది అనుష్క. బట్ నో మ్యారేజ్ అప్ డేట్. సాలిడ్ హిట్స్ తర్వాత కెరీర్ లో చాలా గ్యాప్ వచ్చింది కానీ ఈ బొద్దుగుమ్మ మాత్రం పెళ్లి ఊసెత్తలేదు. ఓసారి ఎంగేజ్ మెంట్ చేసుకుని పెళ్లి క్యాన్సిల్ అయ్యాక త్రిష మళ్లీ ఇంతవరకు పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. ఏజ్ 39ని క్రాస్ చేసిన త్రిష ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ తో పాటూ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ పై కాన్సట్రేట్ చేసింది.

Vijay Devarakonda : లైగర్ బిజినెస్ అయిపోయిందా?? విజయ్ కి బాలీవుడ్ బాగా కలిసొస్తుందా??

ప్రస్తుతం శాంతను హజారికాతో రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తోంది శృతీహాసన్. కెరీర్ అప్ అండ్ డౌన్స్ చూస్తోన్న శృతీ వయసు 36 ఏళ్లు. డేటింగ్ లో ఉన్నా మ్యారేజ్ అంటే మాత్రం నో కామెంట్స్ అనేస్తుంది. పెద్దగా కాంట్రవర్సీలకు చోటివ్వని తమన్నా సైతం పెళ్లి మాట మాట్లాడట్లేదు. టాలీవుడ్ సీనియర్స్ ఛాయిస్ గా మారిన తమన్నా. ఆఫర్స్ వచ్చినన్ని రోజులు సినిమాలు చేసేసి ఆ తర్వాతే పెళ్లికూతురుగా మారుతానంటోంది. మరో రెండు సంవత్సరాల వరకైతే పెళ్లి గిల్లి జాన్తానై అనేసింది.

 

Tollywood Heroins

 

బాలీవుడ్ మేకర్ జాకీ భగ్నానితో రిలేషన్ షిప్ చేస్తున్నానంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది 31 ఏళ్ళ రకుల్ ప్రీత్ సింగ్. బట్ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ప్రకటించింది. ఇక 34 ఏళ్ల నిత్యామీనన్ సైతం మ్యారేజ్ మాట ఎత్తట్లేదు. ఆమధ్య చెన్నైకి చెందిన బడా బిజినెస్ మ్యాన్ తో నిత్యాకు మ్యాచ్ ఫిక్స్ అయిందనే రూమర్స్ వినిపించాయి కానీ నిత్యా సైడ్ నుంచి ఎలాంటి స్టేట్మెంట్స్ రాలేదు.

Pawan Kalyan : మూడు నెలల్లో హరిహరవీరమల్లు అయిపోతుందా??

35ను టచ్ చేసిన పంజాభీ భామ ఛార్మీ కౌర్ సైతం మ్యారేజ్ పై ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వట్లేదు. జ్యోతిల‌క్ష్మీ త‌ర్వాత ఆన్ స్క్రీన్‌పై కాకుండా ఆఫ్ స్క్రీన్‌లో ఉండి పూరీ క‌నెక్ట్స్ బాధ్య‌త‌లు చూసుకుంటున్న ఛార్మి గతంలో పెళ్లిపై తనకు నమ్మకం లేదని, తనకెలాంటి తోడూ అవసరంలేదని చెప్పి పెళ్ళికి దూరమైంది. శింభుతో ప్రేమాయణం బెడిసికొట్టిన హన్సిక మోత్వానీ, కెరీర్ లో స్లో అయిన లావణ్య త్రిపాఠీ, కేథరిన్ థ్రెసా.. ఇలా చాలామందే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో ఉన్నారు.

×