విజయ్ మూవీకి భారీ సెట్

ఆట్లీ దర్శకత్వంలో కోలీవుడ్ యాక్టర్ విజయ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

10TV Telugu News

ఆట్లీ దర్శకత్వంలో కోలీవుడ్ యాక్టర్ విజయ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఆట్లీ దర్శకత్వంలో కోలీవుడ్ యాక్టర్ విజయ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ ఫుట్‌బాల్ టీం కోచ్‌గా కనిపించనున్నాడు. చిత్రయూనిట్ త్వరలోనే సినిమా షూటింగ్ కు సంబంధించి మేజర్ షెడ్యూల్ ను ప్లాన్ చేసింది. అయితే పుట్‌బాల్ మ్యాచ్ సీన్ల కోసం నిర్మాతలు భారీ బడ్జట్ తో సెట్‌ను వేయనున్నారట. సుమారు 6 కోట్ల రూపాయలతో చెన్నై సరిహద్దు ప్రాంతంలో సాకర్ మైదానాన్ని ఏర్పాటు చేస్తున్నారని టాక్.
Read Also : ‘జెర్సీ’ మూవీ ట్రైలర్, ప్రీ రిలీజ్ కు టైం ఫిక్స్

అంతేకాదు పుట్‌బాల్ మ్యాచ్ నేపథ్యంలో వచ్చే కీలక సన్నివేశాలను ఈ మైదానంలో చిత్రీకరించనున్నారట. బాలీవుడ్ న‌టుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో కథిర్, యోగిబాబు, రెబా మోనికా జాన్, వివేక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Read Also : ‘మజిలీ’ డైరక్టర్ తో దేవరకొండ