ఓట‌ర్ నుంచి తొలి లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

ఓట‌ర్ నుంచి తొలి లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

ఓట‌ర్ నుంచి తొలి లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

టాలీవుడ్ లొ మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ‘విష్ణు’సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.  ఆ తర్వాత విష్ణుకి చెప్పుకోదగ్గ సినిమా అంటే ఢీ ఒక్కటీ.  ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా యావరేజ్ టాక్ వచ్చినవే. చాలా కాలం గ్యాప్ తీసుకున్న విష్ణు తాజాగా జీఎస్ కార్తీక్ దర్శకత్వంలో ‘ఓటర్’ సినిమాలో నటిస్తున్నాడు. రామా రీల్స్ బ్యానర్‌పై జాన్ సుధీర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళంలో విడుద‌ల కానున్న ఈ చిత్రంలో విష్ణు స‌ర‌స‌న సుర‌భి క‌థానాయిక‌గా న‌టిస్తుంది. 
Read Also : ‘హిప్పీ’ టీజర్‌ రిలీజ్ చేసిన నాని

ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ‘అహింస మార్గం ద్వారా ఒక్క బుల్లెట్‌ కూడా కాల్చకుండా స్వాతంత్య్రం తెచ్చుకున్న దేశం మనది. మనం పేదరికంపై పోరాటం చేశాం కానీ, పేదలపై పోరాటం చేయలేదు. మార్పు మనలో రావాలి’ అని మంచు విష్ణు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్‌తో టీజ‌ర్ అభిమానుల‌ని అల‌రించింది. 

ఇక తాజాగా చిత్రం నుండి ఐయామ్ 6 ఫీట్ టాల్ అనే సాంగ్ విడుద‌ల చేశారు. రామ జోగ‌య్య శాస్త్రి ఈ పాట‌కి లిరిక్స్ అందించ‌గా, రాహుల్ నంబియార్ ఈ పాటను పాడారు. థ‌మ‌న్ సంగీత సార‌థ్యంలో ఈ సాంగ్ రూపొందింది. ఈ పాట లిరికల్ వీడియోను చూసి  ఆనందించండి.
Read Also : నెత్తిపై పిడుగు : హెల్మెట్ వల్లే బతికాడు

×