హీరోలే ప్రొడ్యూసర్లైతే ఆ లెక్కే వేరబ్బా!!

హీరోలే ప్రొడ్యూసర్లైతే ఆ లెక్కే వేరబ్బా!!

Bollywood actors production houses

Production Houses: ప్రొడ్యూసర్లు కావాలనుకున్నారో.. తాము అనుకున్నంత బడ్జెట్ మరెవ్వరూ పెట్టలేరనుకున్నారో కానీ, సినిమా నిర్మాణంలో అగ్రహీరోలే అడుగులేసేశారు. నచ్చినట్లు సినిమా ప్రొడ్యూస్ చేసుకుంటూ కోట్లలో వెనకేసుకుంటున్నారు. షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి అగ్రహీరోలే కాకుండా ప్రియాంక చోప్రా, అనుష్క శర్మలు కూడా తెలివి చూపించి సొంత బ్యానర్‌కు సై అంటున్నారు.

షారూఖ్ ఖాన్ – రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్
అతని భార్యతో కలిసి రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ ఓపెన్ చేశాడు బాద్ షా. ఓం శాంతి ఓం, రా వన్, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, డియర్ జిందగీ టైటిల్ సినిమాలు భారీగానే డబ్బులు తెచ్చిపెట్టాయి.


అక్షయ్ కుమార్ – హరి ఓం ఎంటర్‌టైన్మెంట్ కంపెనీ
అక్షయ్ కుమార్ బిగ్గెస్ట్ వెంచర్స్ లో ఇదొకటి. మల్టిపుల్ ప్రొడక్షన్స్ నిర్వహిస్తుంది. కేప్ ఆఫ్ గుడ్ హోప్, గ్రేజింగ్ గోట్ ఫిలిమ్స్ వీటికి కూడా అక్షయే ఓనర్. 2008లో స్టార్ట్ చేసిన బ్యానర్ లో వచ్చిందే OMGసినిమా.

ప్రియాంక చోప్రా – పర్పుల్ పెబల్ పిక్చర్స్
ప్రియాంక, ఆమె తల్లి కలిసి డా. మధు చోప్రా పర్పుల్ పెబల్ పిక్చర్స్ – ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్టూడియోను 2015లో స్టార్ట్ చేశారు. ద స్కై ఈజ్ పింక్, మరాఠీ కామెడీ డ్రామా వెంటిలేటర్ లాంటి పలు భాషల్లో తీసేందుకు వెనుకాడడం లేదు.

అజయ్ దేవగన్ – అజయ్ దేవగన్ ఫిలింస్
తానే సొంతగా నిర్మించేసుకున్నాడు అజయ్ దేవగన్ ఫిలింస్. 2000వ సంవత్సరంలో ముంబై వేదికగా భారీ ప్రొడక్షన్స్ మొదలుపెట్టి రాజు చాచా, సన్ ఆఫ్ సర్దార్, సింగం రిటర్న్స్ తీశారు.

అమీర్ ఖాన్ – అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్
అమీర్ ఖాన్ 1999లోనే ఫిల్మ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ హౌజ్ ఓపెన్ చేశారు. ఢిల్లీ బెల్లీ, ధోబీ ఘాట్, దంగల్, లగాన్, లాల్ సింగ్ ఛద్దా అన్నీ దీని నుంచి వచ్చినవే.

అనుష్క శర్మ – Clean Slate Filmz (2013)
సైఫ్ అలీ ఖాన్ – Illuminati Films (2009)
ఫర్షాన్ అక్తర్ – Excel Entertainment (1999)
జాన్ అబ్రహం – JA Entertainment (2008)