Aamir Khan : నా మాజీ భార్యలిద్దర్నీ ప్రతి వారం కలుస్తాను..

అమీర్ ఖాన్ 1986లో రీనా దత్తాని ప్రేమించి పెళ్లి చేసుకొని 2002లో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత 2005లో కిరణ్ రావు ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు కూడా 2021లో విడిపోయారు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో అమీర్ ఖాన్ తన పాస్ట్ రిలేషన్స్ గురించి మాట్లాడుతూ.....

Aamir Khan : నా మాజీ భార్యలిద్దర్నీ ప్రతి వారం కలుస్తాను..

Aamir Khan :  బాలీవుడ్ సూపర్ హిట్ షో కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ ఇటీవలే మొదలైంది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్స్ పూర్తవగా ఐదో ఎపిసోడ్ లో అమీర్ ఖాన్, కరీనా కపూర్ గెస్టులుగా వచ్చారు. ఇటీవలే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. లాల్ సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కరీనా కపూర్, అమీర్ ఖాన్ ఈ షోకి వచ్చారు. సినిమా ప్రమోషన్స్ తో పాటు పర్సనల్ విషయాలని కూడా అడిగాడు కరణ్. దీంట్లో భాగంగానే అమీర్ ఖాన్ పాస్ట్ రిలేషన్స్ గురించి అడిగాడు కరణ్ జోహార్.

Kalyan Ram : తండ్రి మరణాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయిన కళ్యాణ్ రామ్

అమీర్ ఖాన్ 1986లో రీనా దత్తాని ప్రేమించి పెళ్లి చేసుకొని 2002లో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత 2005లో కిరణ్ రావు ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు కూడా 2021లో విడిపోయారు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో అమీర్ ఖాన్ తన పాస్ట్ రిలేషన్స్ గురించి మాట్లాడుతూ.. ”నా రిలేషన్‌షిప్‌లో ప్రేమ, గౌరవం ఉంటాయి. కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు లాంటి క్రూరమైన క్షణాలు లేవు. నా మాజీ భార్యలిద్దరి మీద నాకు గౌరవం ఉంది. ఇప్పటికి కూడా మేమంతా ఓ కుటుంబంలా ఉంటాము. నేను ఎంత బిజీగా ఉన్నా నా భార్యలిద్దర్నీ వారానికోసారైనా కలుస్తాను. మామధ్య కేరింగ్‌, ప్రేమ, అభిమానం అలాగే ఉన్నాయి” అని తెలిపాడు.