Radhe Shyam : సౌత్‌లో సరికొత్త రికార్డ్ సెట్ చేసిన రెబల్ స్టార్..

‘పాన్ ఇండియా స్టార్’ ప్రభాస్ బాలీవుడ్‌లో మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు..

Radhe Shyam : సౌత్‌లో సరికొత్త రికార్డ్ సెట్ చేసిన రెబల్ స్టార్..

Aashiqui Aa Gayi

Radhe Shyam: ‘పాన్ ఇండియా స్టార్’ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా.. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో వస్తున్న బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాధే శ్యామ్’. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోలకి, ‘ఈ రాతలే’ లిరికల్ సాంగ్‌కి చాలా చక్కటి స్పందన వచ్చింది. నవంబర్ 29న ‘రాధే శ్యామ్’ లవ్ ఆంథమ్ ప్రోమో (హిందీ వెర్షన్) విడుదల చెయ్యగా మంచి రెస్పాన్స్ వస్తోంది.

Aashiqui Aa Gayi : మైండ్ బ్లోయింగ్ మెలోడీ… ప్రభాస్ కెరీర్‌లో చూసి ఉండరు..

హిందీ వెర్షన్‌కి మిథున్, మణ్ణన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ‘ఆషికీ ఆగయి’ సాంగ్ అర్జిత్ సింగ్ చాలా చక్కగా పాడారు. నవంబర్ 29 సాయంత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ‘రాధే శ్యామ్’ లవ్ ఆంథమ్ ప్రోమో రిలీజ్ చేశారు. మిగతా నాలుగు భాషల్లోనూ జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్నారు.

Prabhas : ‘ఇన్నాళ్లూ ఈ రొమాన్స్ మిస్ అయిపోయాం డార్లింగ్’..

సాంగ్‌లో విజువల్స్, ప్రభాస్, పూజాల కెమిస్ట్రీ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో ప్రోమో హింట్ ఇచ్చింది. ఇక హిందీ ప్రోమో అయితే రికార్డ్ సెట్ చేసింది. మోస్ట్ లైక్డ్ హిందీ సాంగ్ టీజర్‌గా ‘రాధే శ్యామ్’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సౌత్ ఇండియాలో 24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించింది హిందీ ప్రోమో. ‘ఆషికి ఆగ యి’ (రాధే శ్యామ్) – 294K లైక్స్, ‘సైకో సయ్యాన్’ (సాహో) – 208K లైక్స్, ‘ఎన్నిసోని’ (సాహో) 139K లైక్స్ సాధించాయి.

Radhe Shyam : ప్రభాస్-పూజా హెగ్డేల కెమిస్ట్రీ భలే ఉందిగా..