Acharya: ఆచార్య 3 రోజుల కలెక్షన్స్.. ఎంతో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ....

Acharya: ఆచార్య 3 రోజుల కలెక్షన్స్.. ఎంతో తెలుసా?

Acharya 3 Days Worldwide Collections

Acharya: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించడంతో ‘ఆచార్య’ బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడుకోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. దానికి తోడుగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఇక ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. అయితే ఆచార్య రిలీజ్ రోజున ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. అయినా కూడా ఈ సినిమా తొలిరోజున బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లు రాబట్టి మెగాస్టార్ సత్తాను చాటింది.

Acharya : ‘ఆచార్య’ డే1 కలెక్షన్స్..

పూర్తి యాక్షన్ డ్రామా మూవీగా వచ్చిన ఈ సినిమాలో ఆచార్య పాత్రలో చిరంజీవి, సిద్ధ పాత్రలో చరణ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయినా కథాపరంగా ప్రేక్షకులు ఈ సినిమాకు కనెక్ట్ కాకపోవడంతో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్‌లో సాధారణ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాకు అసలు పరీక్ష సోమవారం నాడు ఎదురుకానుందని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అయితే రంజాన్ సెలవు దినం వస్తుండటంతో ఈ సినిమా వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Acharya : మెగా సక్సెస్ సెలబ్రేషన్స్..

ఇక చిరు, చరణ్ కలిసి నటించిన ఆచార్య చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమా టోటల్ రన్‌లో ఎంతమేర వసూళ్లను రాబడుతుందో చూడాలి అంటున్నారు అభిమానులు. తొలి మూడు రోజులు ముగిసే సరికి ఆచార్య చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.45.52 కోట్ల మేర షేర్ వసూళ్లు రాబట్టగా, రూ.70.65 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఏరియాల వారీగా ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – రూ.11.56 కోట్లు
సీడెడ్ – రూ.5.87 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.4.66 కోట్లు
ఈస్ట్ – రూ.3.18 కోట్లు
వెస్ట్ – రూ.3.29 కోట్లు
గుంటూరు – రూ.4.52 కోట్లు
కృష్ణా – రూ.2.84 కోట్లు
నెల్లూరు – రూ.2.80 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.38.72 కోట్లు (రూ.55.90 కోట్ల గ్రాస్)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా – రూ.2.45 కోట్లు
ఓవర్సీస్ – రూ.4.35 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – రూ.45.52 కోట్లు (రూ.70.65 కోట్ల గ్రాస్)