Meena : నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం

ఈ ఏడాది జూన్ లో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. కరోనా తర్వాత కోలుకున్నాక మీనా భర్త మాత్రం పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఊపిరితిత్తుల్లో ఏదో సమస్య..............

Meena : నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం

Meena

Meena :  బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయి ఆ తర్వాత తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా పరిశ్రమని ఏలింది మీనా. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లోనూ మదర్ క్యారెక్టర్స్, సీనియర్ హీరోల పక్కన చేస్తూ బిజీ బిజీగా ఉంది. 2009లో మీనాకు బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్న విద్యాసాగర్ తో వివాహం జరిగింది. పెళ్లి అయి పాప పుట్టిన తర్వాత కొన్నేళ్లు సినిమాలకి బ్రేక్ తీసుకున్నా ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ అయింది. మీనా పాప నైనిక కూడా ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా చేసిన తేరి మూవీలో నటించింది.

Kamal Haasan : రోబో2 తర్వాత ఆ ఫీట్ సాధించిన విక్రమ్..

Meena1

 

ఈ ఏడాది జూన్ లో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. కరోనా తర్వాత కోలుకున్నాక మీనా భర్త మాత్రం పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఊపిరితిత్తుల్లో ఏదో సమస్య వచ్చిందని గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు విద్యాసాగర్. మంగళవారం రాత్రి చికిత్స తీసుకుంటూనే హాస్పిటల్ లో నటి మీనా భర్త మరణించారు. దీంతో మీనా కుటుంబం శోక సంద్రంలో మునిగింది. సౌత్ పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు మీనా భర్తకి సంతాపం తెలుపుతూ నివాళులు అర్పిస్తున్నారు.