ప్రగతి స్టెప్స్ చూస్తే సీటీ కొట్టడం పక్కా..

పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి తీన్‌మార్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

ప్రగతి స్టెప్స్ చూస్తే సీటీ కొట్టడం పక్కా..

పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి తీన్‌మార్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా అప్‌డేట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్, డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో వెబ్ సిరీస్, సినిమాలతో టైమ్ పాస్ చేస్తున్నారు. సెలబ్రిటీలు తమ రోజువారీ పనుల తాలుకూ విషయాలను వీడియో రూపంలో ప్రేక్షకులతో షేర్ చేసుకుంటున్నారు.

 Pragathi

తాజాగా తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరొందిన ప్రగతి చేసిన తీన్‌మార్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు, తమిళ్, మలయాళంలో వందకు పైగా సినిమాలు చేసి.. అతికొద్ది మంది క్యారెక్టర్ నటీమణుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ప్రగతి.

 Pragathi

రెగ్యులర్‌గా తన వర్కౌట్స్ వీడియోలు ఇన్‌స్టాలో షేర్ చేసే ప్రగతి ఈ క్వారంటైన్ టైములో కొడుకుతో కలిసి తీన్‌మార్ స్టెప్స్ వేసింది. పక్కా మాస్ మసాలా స్టైల్లో లుంగీ ఎగ్గట్టి ప్రగతి వేసిన ఊరమాస్ మూమెంట్స్ చూస్తే సీటీ కొట్టాలనిపించడం మాత్రం పక్కా.. ప్రస్తుతం ఈ వీడియో పలు సోషల్ సైట్లలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Read Also : మోడీ డాడీ.. మే 3 తర్వాత కరోనా స్కైలోకి షిఫ్ట్ అవుతుందా?.. శ్రీ రెడ్డి కాంట్రవర్సియల్ కామెంట్స్