Adigaa Adigaa : బాలయ్య బ్లాక్‌బస్టర్ మెలోడీ..

‘అఖండ మ్యూజికల్ రోర్’ పేరుతో రిలీజ్ చేసిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది..

Adigaa Adigaa : బాలయ్య బ్లాక్‌బస్టర్ మెలోడీ..

Adiga Adiga Lyrical Video

Adigaa Adigaa: ‘సింహా’, ‘లెజెండ్’ వంటి భారీ బ్లాక్‌ బస్టర్ విజయాల త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల మాసివ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Balakrishna : అఖండ‏లో అదే హైలెట్..!

ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ రోర్‌ అండ్ టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. బాలయ్య అఘోరాగా కనిపించి సర్‌ప్రైజ్ చేసిన వీడియో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో బాలయ్య బాబు రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. శనివారం సాయంత్రం ‘అఖండ మ్యూజికల్ రోర్’ పేరుతో ఫస్ట్ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు.

Balakrishna : తారక్ తగ్గాడు.. బాలయ్య ‘అఖండ’ అక్టోబర్‌లోనే..

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. కళ్యాణ చక్రవర్తి అందమైన పదాలు రాశారు.. ఎస్.పి. చరణ్, ఎమ్.ఎల్. శృతి అంతే అందంగా పాడారు.. ‘‘అడిగా.. అడిగా.. పంచ ప్రాణాలు నీ రాణిగా.. జతగా.. జతగా.. పంచు నీ ప్రేమ పారాణిగా.. చిన్న నవ్వే రువ్వి మార్చేశావే.. నా తీరు నీ పేరుగా.. చూపు నాకే చుట్టు కట్టేశావే.. నన్నేమో సన్నాయిగా.. కదిలే కలలే.. కళ్ల వాకిళ్లలో కొత్తగా.. కౌగిలే ఓ సగం.. పొలమారిందిలే వింతగా’’.. అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది.. బాలయ్య, ప్రగ్యా పెయిర్ బాగుంది..

#Akhandafirstsingle, #AkhandaMusicalRoar అనే హ్యాష్ ట్యాగ్లతో ‘అడిగా.. అడిగా’ సాంగ్ ట్రెండ్ అవుతోంది. ‘సింహా’ లో ‘బంగారుకొండ’.. ‘లెజెండ్’ లో ‘నీ కంటి చూపుల్లోకి’ వంటి మెలోడీ సాంగ్స్ ఏ రేంజ్‌లో ప్రేక్షకులను, సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయో తెలిసిందే. ‘అఖండ’ లోని ‘అడిగా.. అడిగా’ సోల్ ఫుల్ మెలోడీ కూడా అదే స్థాయిలో సక్సెస్ అవుతుందనిపిస్తుంది. త్వరలో ‘అఖండ’ గా బాలయ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.