Adivi Sesh : చాలా పొగరుగా ప్రవర్తించేవాడు.. దర్శకుడుపై అడివి శేషు ఆరోపణలు..

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేషు ఒక యువీ దర్శకుడుపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఈ యాక్షన్ హీరో క్రైమ్ థిల్లర్ 'హిట్-2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక విషయానికి వస్తే..

Adivi Sesh : చాలా పొగరుగా ప్రవర్తించేవాడు.. దర్శకుడుపై అడివి శేషు ఆరోపణలు..

Adivi Sesh Comments on Two States Director

Updated On : November 30, 2022 / 5:26 PM IST

Adivi Sesh : టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేషు ఒక యువీ దర్శకుడుపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఈ యాక్షన్ హీరో క్రైమ్ థిల్లర్ ‘హిట్-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నేచురల్ స్టార్ నాని నిర్మిస్తున్న ఈ సినిమా ‘హిట్ వర్స్’లో సెకండ్ కేసు గా వస్తుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.

Hit 2 : శ్రద్ధా వాకర్‌ హత్య కేసే హిట్ 2 స్టోరీనా? అడివి శేష్ ఏం చెప్పాడు??

ఇక విషయానికి వస్తే.. అడివి శేషు, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా 2019 లో పూజ కారిక్రమాలతో ఒక సినిమా మొదలయింది. హిందీ సినిమా ‘టూ స్టేట్స్’కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో వి వి వినాయక్ శిష్యుడు వెంకట్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అయితే ఈ సినిమా కొంతభాగం షూటింగ్ జరుపుకున్న తరువాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.

తాజాగా హిట్-2 ప్రమోషన్స్ లో ఈ సినిమా గురించి అడివి శేషుని ప్రశ్నించగా.. “దర్శకుడు వెంకట్ రెడ్డి ఏం చేస్తున్నాడో తనకి తెలియదు. సెట్‌లో చాలా పొగరుగా ప్రవర్తించేవాడు. యాక్టర్స్ మీద కూడా అరిచేవాడు. నిర్మాత కూడా ఒత్తిడికి గురై సమస్యలు ఎదురుకున్నాడు. దీంతో నేను నిర్మాతతో మాట్లాడి, అతను ఇప్పటివరకు సినిమాకు ఎంత ఖర్చు చేసాడో, ఆ మొత్తం పరిహారం అయ్యేలా నా సినిమా గూఢచారి 2లో అతనికి వాటా ఇస్తానని చెప్పి, ఆ సినిమాను ఆపేశాము” అంటూ బదులిచ్చాడు.