Adivi Sesh: అడివి శేష్ G2 ప్రీ-వెర్షన్.. టెర్రిఫిక్.. అంతే!

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సక్సెస్‌ఫుల్ చిత్రాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో అడివి శేష్, ఇటీవల హిట్-2 మూవీతో బాక్సాపీస్ వద్ద అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు తన పూర్తి ఫోకస్‌ను తన నెక్ట్స్ స్పై థ్రిల్లర్ మూవీ ‘గూఢచారి-2’పై పెట్టాడు ఈ హీరో. ‘G2’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్క్రిప్టును అడివి శేష్ స్వయంగా అందిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Adivi Sesh: అడివి శేష్ G2 ప్రీ-వెర్షన్.. టెర్రిఫిక్.. అంతే!

Adivi Sesh G2 Pre-Version Looks Stunning

Adivi Sesh: ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సక్సెస్‌ఫుల్ చిత్రాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో అడివి శేష్, ఇటీవల హిట్-2 మూవీతో బాక్సాపీస్ వద్ద అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు తన పూర్తి ఫోకస్‌ను తన నెక్ట్స్ స్పై థ్రిల్లర్ మూవీ ‘గూఢచారి-2’పై పెట్టాడు ఈ హీరో. ‘G2’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్క్రిప్టును అడివి శేష్ స్వయంగా అందిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Adivi Sesh : చిరు చేతులు మీదగా అవార్డుని అందుకున్న అడివి శేషు..

ఇక తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ముంబైలో జరిగిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో హీరో అడివి శేష్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. అభిషేక్ అగర్వాల్, వినయ్ కుమార్‌లతో పాటు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అడివి శేష్ మ్యాన్ ఇన్ యాక్షన్‌గా కనిపిస్తున్నాడు.

Adivi Sesh : సాహో తర్వాత సుజీత్‌కి బాలీవుడ్ ఆఫర్స్ చాలా వచ్చాయి.. కానీ..

ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, ఈ సినిమాను ‘మేజర్’ చిత్ర ఎడిటర్ వినయ్ కుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అప్పుడే భారీగా క్రియేట్ అవుతున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనుంది. ఇక ఈ సినిమాలోని మిగతా నటీనటులు, టెక్నీషియన్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.