Ajith Kumar: 7 ఖండాల్ని బైక్ పై చుట్టేబోతున్న హీరో అజిత్.. నిజమేనా?
తమిళ సూపర్ స్టార్ 'అజిత్ కుమార్' బైక్ పై సాహసాలు చేస్తూ.. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను హీరో అనిపించుకుంటున్నాడు. తాను నటించిన 'వలిమై' చిత్రంలోనూ కూడా అదిరిపోయే బైక్ స్టాంట్స్ చేసి అదరహో అనిపించాడు. తాజాగా ఈ హీరో మరో సుదీర్ఘ సాహసానికి సిద్దమవుతున్నట్లు తమిళనాట కథనాలు వినిపిస్తున్నాయి.

Ajith Kumar Bike Trip Over 7 Continents
Ajith Kumar: తమిళ సూపర్ స్టార్ ‘అజిత్ కుమార్’ బైక్ పై సాహసాలు చేస్తూ.. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను హీరో అనిపించుకుంటున్నాడు. తాను నటించిన ‘వలిమై’ చిత్రంలోనూ కూడా అదిరిపోయే బైక్ స్టాంట్స్ చేసి అదరహో అనిపించాడు. తాజాగా ఈ హీరో మరో సుదీర్ఘ సాహసానికి సిద్దమవుతున్నట్లు తమిళనాట కథనాలు వినిపిస్తున్నాయి.
Vijay-Ajith: తమిళం నుండి మెగా మల్టీస్టారర్.. సెట్టైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
ప్రస్తుతం అజిత్, డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నయనతార హీరోగా నటిస్తుంది. నయన్-విగ్నేష్ పెళ్లి కారణంగా సినిమా షూటింగ్ ప్రారంభానికి కొంత గ్యాప్ వచ్చింది. కాగా ఈ సినిమా పూర్తీ చేశాక అజిత్ 81 రోజుల్లో 7 ఖండాలోని 62 దేశాలను బైక్ పై చుట్టి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు, తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
7 ఖండాలోని కఠిన ప్రస్థితులను, వాతావర్ణాని ఎదుర్కొనేలా.. అజిత్ గత కొన్ని రోజులుగా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంత వరకు ఉందొ తెలియదు. ఇప్పటికే ఈ హీరో భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బైక్ పై చూటేసిన సంగతి తెలిసిందే.
After The Movie #AK62 – #Ajith Sir Going For A Long RIDE ?
Across 7 CONTINENTS..!!#Thunivu | #AjithKumar | #NoGutsNoGlory. pic.twitter.com/IMoxAE8Y7Q
— Ajith UK Fans (@AjithUKFans) October 18, 2022