Vijay-Ajith: తమిళం నుండి మెగా మల్టీస్టారర్.. సెట్టైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

తమిళంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు అజిత్, విజయ్. దాదాపుగా ఒకేసారి స్టార్ డమ్ దక్కించుకున్న ఈ హీరోల అభిమానులు ఎక్కడ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరి హీరోల సినిమాలు వస్తున్నాయంటే.. అభిమాన సంఘాలు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

Vijay-Ajith: తమిళం నుండి మెగా మల్టీస్టారర్.. సెట్టైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

Ajith Vijay

Vijay-Ajith: తమిళంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు అజిత్, విజయ్. దాదాపుగా ఒకేసారి స్టార్ డమ్ దక్కించుకున్న ఈ హీరోల అభిమానులు ఎక్కడ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరి హీరోల సినిమాలు వస్తున్నాయంటే.. అభిమాన సంఘాలు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో ఇది మరీ శృతి మించి ఒక హీరో సినిమా వస్తుంటే.. యాంటీ ఫ్యాన్స్ ఆ సినిమాపై సోషల్ మీడియాలో నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంతో పాటు ఆ హీరోలు చనిపోయారని కూడా ఫేక్ వార్తలు సృష్టించి కొట్టుకు చచ్చేలా మారిపోయింది.

Vijay-Ajith: విజయ్ చనిపోయాడని.. అజిత్‌కి ఎయిడ్స్ అంటూ.. ఫ్యాన్స్ వార్!

ఒకరంటే మరొకరి అభిమానులు అసలు సహించలేని విధంగా ఉన్న తమిళ సినీ పరిశ్రమలో ఇప్పుడు ఓ క్రేజీ టాక్‌‌‌ నడుస్తుంది. అదేంటంటే.. అజిత్, విజయ్ హీరోలు ఓ భారీ మల్టీస్టారర్ సినిమా చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. ఈ ఇద్దరు బిగ్ స్టార్స్ తో కలిపి ఒక సినిమా చెయ్యాలని ఉందని.. ఈ సినిమా కోసం ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉందని ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు రీసెంట్ గా ఓ కాలేజ్ ఫంక్షన్ లో కామెంట్స్ చేశాడు. దీంతో ఇది కాస్త తమిళ సినీ వర్గాల్లో ఆసక్తిగా మారిపోయింది.

Kollywood Stars: టాలీవుడ్‌లో పాగా వేసేందుకు తమిళ తంబీల ప్లాన్స్!

నిజానికి తెలుగులో ఆర్ఆర్ఆర్ ముందు మెగా, నందమూరి అభిమానుల మధ్య ఇదే తరహా అగ్రెసివ్ ఉండేది. అయితే.. ఆర్ఆర్ఆర్ ప్రకటన నుండి సినిమా వచ్చే వరకు ఈ అభిమానుల మధ్య ఒకవిధంగా మనమంతా ఒక్కటే అనే భావన వచ్చేసింది. ఇప్పుడు ఇదే మాదిరి తమిళనాట కూడా అజిత్, విజయ్ లతో మల్టీస్టారర్ సెట్ చేయాలని సన్నాహాలు మొదలైనట్లు కనిపిస్తుంది. అయితే.. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. వెంకట్ ప్రభు లాంటి దర్శకుడు ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసే సత్తా ఉన్నా ఆ హీరోలను ఒప్పించడమే అసలైన టాస్క్. మరి ఇది సెట్టవుతుందో లేదో చూడాలి. కానీ ఒకవేళ సెట్టైతే మరోసారి దక్షణాదిలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.