Vijay-Ajith: విజయ్ చనిపోయాడని.. అజిత్‌కి ఎయిడ్స్ అంటూ.. ఫ్యాన్స్ వార్!

విజయ్ దళపతి చనిపోయాడని #RIPJosephVijay అనే హ్యాష్ టాగ్ తో కొందరు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఒకటి క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. హీరో అజిత్ కు ఎయిడ్స్ అనే ట్రెండ్ క్రియేట్..

Vijay-Ajith: విజయ్ చనిపోయాడని.. అజిత్‌కి ఎయిడ్స్ అంటూ.. ఫ్యాన్స్ వార్!

Vijay Ajith

Vijay-Ajith: హీరోలంతా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ.. స్నేహితులుగా మెలుగుతూ భాయి భాయి అంటుంటే వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం వెర్రి అభిమానంతో కొట్టుకుచస్తున్నారు. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఈ పిచ్చి పరాకాష్టకు చేరింది. తమిళ సినీ ఇండస్ట్రీలో రజనీకాంత్ లాంటి సీనియర్ల తర్వాత భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోలు అజిత్, విజయ్. ఈ హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో కామెంట్లు, ట్రోల్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఈ హీరోల సినిమాలు, బర్త్ డే వస్తుంటే పనిగట్టుకొని మరీ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తుంటారు.

Vijay: మెగా క్లాష్.. కేజీఎఫ్2తో బీస్ట్ వార్..?

అప్పుడప్పుడు ఒకరి మీద ఒకరు ట్రోల్స్ చేసుకుంటూ అందుకు తమ హీరోలను కూడా బలి చేస్తుంటారు. ఇప్పుడు అలాంటిదే జరుగుతుంది తమిళ ఇండస్ట్రీలో. విజయ్ దళపతి చనిపోయాడని #RIPJosephVijay అనే హ్యాష్ టాగ్ తో కొందరు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఒకటి క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. అది అజిత్ ఫ్యాన్స్ పనేనని భావించిన విజయ్ ఫ్యాన్స్ విజయ్ చనిపోయాడని వార్తను ఖండిస్తూనే హీరో అజిత్ కు ఎయిడ్స్ అనే ట్రెండ్ క్రియేట్ చేసి #Aids_Patient_Ajith హ్యాష్ టాగ్ తో రచ్చ చేస్తున్నారు.

Ajith Shalini: వైఫ్‌తో తలా బ్లూలైట్ రొమాన్స్.. వైరల్‌గా మారిన ఫోటోలు!

ఇలా ఒక హీరో చనిపోయాడని.. మరో హీరోకు మహమ్మారి రోగాన్ని అంటించి తమ ఫ్యాన్స్ శునకానందం పొందుతున్నారు. సోషల్ మీడియాలో ఇలా అభిమానుల మధ్య పనికిమాలిన యుద్దాన్ని గమనిస్తున్న మిగతా నెటిజన్లు అభిమానులను తిట్టిపోస్తున్నారు. అసలు ఇలాంటి శాడిస్ట్ అభిమానులను అర్జెంట్ గా మెంటల్ హాస్పటిల్ లో చేర్పించాలని.. లేదంటే ఇలాంటి వాళ్ళు బయట ఉంటే సమాజానికి మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఈ యుద్ధం ఎంతవరకు వెళ్తుందో.. హీరోలు ఏమైనా స్పందించి అడ్డుకుంటారో లేదో!