PUBG మర్చిపోండి.. ‘FAU-G’ ఆడండి.. అక్షయ్ దేశభక్తి మంత్రం..

  • Published By: sekhar ,Published On : September 4, 2020 / 06:58 PM IST
PUBG మర్చిపోండి.. ‘FAU-G’ ఆడండి.. అక్షయ్  దేశభక్తి మంత్రం..

Akshay Kumar announces FAU-G: భారత్‌ దేశంలో విస్తృత ఆదరణ పొందిన పబ్-జి గేమ్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో స్వదేశీ డెవలపర్స్‌కు మంచి అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ‘ఎన్ కోర్ గేమ్స్’ సంస్థ తాజాగా ‘ఫియర్‌లెస్ అండ్ యునైటెడ్: గార్డ్స్’ (FAU:G) పేరుతో ఓ యాక్షన్ గేమ్‌ను రూపొందించింది.


ప్రధాని నరేంద్రమోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తితో, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నేతృత్వంలో ఈ గేమ్ రూపొందింది. ఈ గేమ్ గురించి అక్షయ్ తాజాగా ట్వీట్ చేశారు.


‘‘ప్రధాని నరేంద్రమోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ ఉద్యమ స్ఫూర్తితో ‘ఫియర్‌లెస్ అండ్ యునైటెడ్: గార్డ్స్’ (FAU:G) అనే యాక్షన్ గేమ్‌ను సగర్వంగా ప్రకటిస్తున్నాను. ఈ గేమ్ ఆడడం ద్వారా వినోదం మాత్రమే కాకుండా, మన సైనికుల త్యాగాల గురించి కూడా ఆటగాళ్లు తెలుసుకుంటారు. ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం ‘భారత్ కా వీర్’ ట్రస్టుకు అందుతుంది’’ అని అక్షయ్ పేర్కొన్నారు. ఈ గేమ్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.