Amithab Bachchan : అమితాబ్.. ఇండియాన్ స్టార్.. బర్త్ డే స్పెషల్ స్టోరీ

అమితాబ్ బచ్చన్ దాదాపు 200 సినిమాలలో నటించారు. 24 సినిమాలలో పాటలు పాడారు. ఎనిమిది చిత్రాలు నిర్మించారు. సిల్వర్ స్ర్కీన్ కు వచ్చి ఐదున్నర దశాబ్దాలు అయిపోతోంది. అయినా ఇప్పటికీ చేతినిండా సినిమాలు, బుల్లితెర వినోదాలు...............

Amithab Bachchan : అమితాబ్.. ఇండియాన్ స్టార్.. బర్త్ డే స్పెషల్ స్టోరీ

Amithab Bachchan Birthday Special Story

Amithab Bachchan :  అమితాబ్.. ఆయన పేరొక వైబ్రేషన్. ఆయన సినిమాలు ఫ్యాన్స్ కు ఎప్పుడూ సెలబ్రేషన్. ఆయన యాక్టింగ్ ఇప్పటి హీరోలకు లెసన్స్. ఆయన సినిమాలు అందరు దర్శకులకు రీసెర్చ్ మెటీరియల్. ఎయిటీ ఏజ్ లో కూడా 16 గంటలు పనిచేసే ఆ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్. అందుకే ఆయన బాలీవుడ్ కు ఇప్పటికీ ఎప్పటికీ ఎనర్జిటిక్ యంగ్ హీరో. రీల్ లైఫ్ లో ఐదుపదులు పూర్తి చేసుకున్న అమితాబ్ బచ్చన్ నట ప్రస్థానంలో ఎన్నో మెరుపులు. మరెన్నో మలుపులు. లెక్కకు మించిన సినిమాలు. చెప్పలేనన్ని పాత్రలు.

అమితాబ్ పేరెత్తకుండా ఇండియన్ సినిమా గురించి చెప్పడం సాధ్యం కాదు. బాలీవుడ్ లో ట్రెండ్ చేసిన ఎన్నో సినిమాలు ఆయన్ని ఇండియన్ సూపర్ స్టార్ ను చేశాయి. గొంతు బాగోలేదని, నటుడిగా పనికిరాడని ఆయన్ను రిజెక్ట్ చేశారు. అలాంటి పరిస్థితులని ఫేస్ చేసినా తన కాన్ఫిడెన్స్ ను వదులుకోకుండా ప్రయత్నించి చివరికి సక్సెస్ సాధించారు.

1969లో ‘భువన్ షోమ్’తో మొదలైంది అమితాబ్ ప్రస్థానం. ఫస్ట్ సినిమాకే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు అమితాబ్‌. ‘జంజీర్’ సినిమాతో అమితాబ్ లైఫ్ మారిపోయింది. ‘జబ్‌ తక్ బైఠ్‌ నే కో న కహా జాయే షరఫత్‌ సే ఖాదే రహో’..’యే పొలీస్ స్టేషన్ హై.. ‘తుమ్హారే బాప్ కా ఘర్ నహీ’ అనే డైలాగ్ బాగా ఫేమస్ అయింది. ఈ సినిమా అమితాబ్ బచ్చన్​కు యంగ్రీ మేన్ గా స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది.

నాటి సూపర్ స్టార్లు రాజేశ్ ఖన్నా, ధర్మేంద్ర బాలీవుడ్ ను ఏలుతున్నారు. మరోవైపు షమ్మీకపూర్ జోరు మీదున్నారు. శశికపూర్, శతృఘ్నసిన్హాలు అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతున్నారు. అలాంటి టైమ్ లో అమితాబ్ వారికి దీటుగా నిలబడ్డారు. ఎందరు సూపర్ స్టార్స్ ఉన్నా తనకు వచ్చిన అవకాశాలు అన్నిటినీ సద్వినియోగం చేసుకున్నారు అమితాబ్. పాత్ర చిన్నదా పెద్దదా అని చూడలేదు. తన నటనకు మెరుగులు దిద్దుకొనే విధంగా ఆ ఆఫర్స్ ను యాక్సెప్ట్ చేసి నటుడిగా సత్తా చాటుకున్నారు అమితాబ్. ఆ తర్వాత వచ్చిన సినిమాలే ఆయన్ని అంతకంతకు సూపర్ స్టార్ ను చేశాయి.

ఆ రోజుల్లో నిర్మాత మన్మోహన్ దేశాయి బాలీవుడ్ లో మసాలా సినిమాలకు ఓ బ్రాండ్ అంబాసిడర్. అండర్ వరల్డ్ డాన్ గా ఘాతుకాలకు తెగించే గ్యాంగ్ స్టర్లు, మాఫియా కథాంశాలతో సినిమాలు తీశారు. ఆ క్రమంలో వచ్చిన సినిమానే ‘దీవార్’. అమితాబ్ విజయాలకు గ్రేట్ వాల్‌ లాంటిది ‘దీవార్’. స్మగ్లర్ హాజీమస్తాన్ జీవిత కథాంశం ఆధారంగా తెరకెక్కంచిన సినిమా. అమితాబ్ సూపర్ స్టార్ డమ్ కు నాంది పిలికిన సినిమా ఇది.

1975 లో బాలీవుడ్ లో ఓ అద్భుతం జరిగింది. ఇండియన్ స్ర్కీన్ షేక్ అయ్యే ఓ షాకింగ్ సినిమా ఒకటి వచ్చింది. అది అమితాబ్ ను సూపర్ స్టార్ గా ఎదగడానికి దోహదం చేసిన ప్రధాన సినిమాగా చెప్పుకోవాలి. భారతీయ సినీ చరిత్రలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘షోలే’. జయదేవ్ పాత్రలో అమితాబ్ జీవించారు. స్నేహితుడు వీరుగా ధర్మేంద్ర నటించారు. షోలే అంటే నివురు గప్పిన నిప్పు అని అర్ధం. దేశ చరిత్రలో బ్లాక్ బస్టర్ అనే పదానికి సరైన మీనింగ్ చెప్పిన సినిమా ‘షోలే’. ముంబై మినర్వాలో ఐదున్నర ఏళ్లు కంటిన్యూ్స్ గా ఆడిన సినిమా. అంతులేని రికార్డులు ‘షోలే’ సొంతం అయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికీ ఈ సినిమా గురించి చెప్పుకుంటారంటే దాని స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

అమితాబ్ కెరీర్ బిఫోర్ ‘షోలే’, ఆఫ్టర్ ‘షోలే’ గా మార్చిన సినిమా షోలే. అప్పట్లోనే మూడు గంటలు రన్ టైమ్ కలిగిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అయినా సరే ప్రేక్షకులు పదే పదే ఆ సినిమాను చూసి అమితాబ్ బచ్చన్ ను తమ ఫేవరేట్ హీరోగా మార్చేసుకున్నారు. నిజం చెప్పాలంటే ఇందులోని ధర్మేంద్ర పాత్ర కన్నా అమితాబ్ పాత్రకే ఎక్కువ పేరొచ్చింది. ప్రేక్షకుల మనసుల్లో స్ట్రాంగ్ గా రిజిస్టరైపోయింది. ఈ మూవీ తర్వాత అమితాబ్ రేంజే మారిపోయింది. అమితాబ్ బాలీవుడ్ లో వరుస విజయాలతో జోరుగా దూసుకెళుతున్న సమయంలో ఓ అనూహ్య సంఘటన అభిమానుల్ని షాకయ్యేలా చేసింది. దేశమే తన గురించి కలవరపడే స్థాయికి అప్పటికే అమితాబ్ చేరుకున్నారు.

1982లో బెంగళూరులో ‘కూలీ’ సినిమా షూటింగ్ సందర్భంగా బల్లమీద పడిపోవటం వల్ల అమితాబ్‌కు పొత్తికడుపులో తీవ్రగాయాలయ్యాయి. దేశం అంతా కోట్లాదిమంది అమితాబ్ కోలుకోవాలని మొక్కులు మొక్కారు. ముంబయి డాక్టర్ల కృషి, కోట్లాది అభిమానుల కోర్కెను భగవంతుడు మన్నించాడు. అమితాబ్ మృత్యుంజయడయ్యారు. గాయం నుంచి పూర్తిగా కోలుకొన్న అమితాబ్ ‘కూలీ’ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఆ గాయం ఎఫెక్టో ఏమో కానీ అమితాబ్ నటించిన ఆ తర్వాత సినిమాలు వరుసగా సూపర్ హిట్స్ సాధించాయి. ఇంక్విలాబ్, షరాబీ, గిరఫ్తార్ లాంటి సినిమాలు అమితాబ్ ను బాలీవుడ్ కు ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ ను చేశాయి.

అమితాబ్ సినిమాల్లోని పాటలు ఇప్పటికీ ఏదో మూల మారుమోగుతునే ఉంటాయి. ఆ పాటలు ఒకప్పుడు దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపేశాయి. ఇప్పుడు వింటున్నా ఎంతో ఫ్రెష్ గా ఉంటాయి ఆ పాటలు. అమితాబ్ హీరోగా నటించిన ‘ముకద్దర్ కా సికిందర్’ మ్యూజికల్ హిట్. ఒక బ్లాక్ బస్టర్ మూవీ. అనాథగా పెరిగిన కథానాయకుని పాత్రలో అమితాబ్ కదలించేలా నటించారు. ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా రేతే హుయే పాట అప్పటి జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంది.

ఇక ‘మిస్టర్ నట్వర్ లాల్’ సినిమాలో నాటి గ్లామర్‌ క్వీన్ రేఖతో అభినయించిన యుగళం పరదేశియా.. ఆల్ టైమ్ హిట్​గా నిలిచింది. ఇంకా మంజిల్ సినిమాలోని ‘రిమ్‌ జిమ్‌ గిరే సావన్’ పాట ఇప్పటికీ బాలీవుడ్‌ ఆల్‌ టైం హిట్ పాటల్లో ఒకటి అని చెప్పుకుంటారు. అలాగే .. షాన్ మూవీలోని యమ్మా యమ్మా అనే హుషారు గీతం అప్పటి యూత్ ను కుదిపేసింది.

తన కెరీర్ సంపాదించిన మొత్తంతో అమితాబ్ సినిమా నిర్మిస్తే ఎన్నో విధాలుగా నష్టపోయారు. దాంతో ప్రొడక్షన్ జోలికి మళ్లీ పోలేదు అమితాబ్. అయితే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి మళ్ళీ నటుడిగా విజృంభించారు. ‘మొహబ్బతే’ మూవీ సూపర్ సక్సెస్ న్యూ మిలీనియంలో శుభారంభం పలికింది. 2001లో ‘కభీ కుషీ కభీ గమ్’ సూపర్‌హిట్‌తో ఇంక అమితాబ్ పూర్వ వైభవం వచ్చేసింది. ‘కభి కుషి కభీ గమ్’ చిత్రాన్ని అభిమాన ప్రపంచం బహుత్ సుందర్ ఔర్ శాందార్ సినిమా’ అంటూ కీర్తించింది. ఇందులో ‘షవ షవ షవ’అనే పాటలో అమితాబ్ బచ్చన్ డ్యాన్స్ అద్భుతంగా చేశారు.

Amitabh Bachchan: అమితాబ్‌కి కన్నీళ్లు తెప్పించిన అభిషేక్ బచ్చన్.. వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో!

కొడుకు అభిషేక్ బచ్చన్‌తో కలసి ‘బంటీ ఔర్ బాబ్లి’, 2006లో ‘కభి అల్విద నా కెహనా’ మూవీస్ లో నటించారు అమితాబ్. ఈ రెండు సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఆ తర్వాత ఏకలవ్య, నిశ్శబ్ద సినిమాల్లో ఆయన నటనకు మంచి గుర్తింపు లభించింది. మహిళా సమస్యలే కథాంశంగా రూపొందిన ‘పింక్‌’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2015 లో రిలీజైన పీకు.. కుటుంబాల్లో వృద్ధుల ప్రవర్తనకు అద్దం పడుతుంది. అగ్రెసివ్ పాత్రలో అమితాబ్ అదరగొట్టారు. ఇక పీకులో అమితాబ్ ఒక ప్రమోషన్ సాంగ్ పాడారు. ఇక రీసెంట్ గా నూ అమితాబ్ ‘గుడ్ బై’ అనే మూవీలో నటించి తన నటనకి వయసులో సంబంధం లేదని నిరూపించారు.

వెండితెరపైనే కాదు.. అమితాబ్ ఇమేజ్ బుల్లితెరపైనా ఓ రేంజ్ లో పెరిగిపోయింది. కౌన్ బనేగా కరోడ్ పతి క్విజ్ షోతో అమితాబ్ బచ్చన్ తన పాపులారిటీని డబుల్ చేసుకున్నారు. 2000 నుంచి అనేక సీజన్లలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నా ‘కౌన్ బనేగా కరోడ్ పతి’తో అమితాబ్ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు. ‘నమస్కార్ శాస్త్రీజీ! మై అమితాబ్ బచ్చన్ బోల్ రహా హూ..ఆప్ కే బేటా హమారా సాత్‌ హై..’ అంటూ లైఫ్‌ లైన్ తీసుకునే సందర్భంలో మాట్లాడుతుంటే వీక్షకులకు కలయో, నిజమో అర్ధంకాక ఎంతో ఎమోషనల్ అయిపోతారు జనం.

కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ ను చూసి అన్ని భాషల్లోనూ దాన్ని మొదలు పెట్టారు. కానీ అమితాబ్ బచ్చన్ స్థాయిలో ఎవరూ హోస్టింగ్ చేయలేకపోవడం గమనార్హం. కంటెస్టెంట్స్ తో, ఆడియన్స్ తో, ఫోన్ ఇన్ లోనూ జనంతో ఆయన కనెక్ట్ అయిన రేంజ్ లో వేరెవరూ కనెక్ట్ అవ్వలేకపోవడం అమితాబ్ గొప్పతనం ఏపాటిదో అర్ధమవుతుంది. ప్రస్తుతం బచ్చన్ సాబ్.. చేతినిండా సినిమాలు, బ్రాండ్ అండార్స్ మెంట్స్, రియాలిటీ షోలు ఇలా ప్రతీ రంగంలోనూ బిజీగా ఉన్నారు. తన వయసు పెరుగుతోందన్న విషయం మరిచిపోయి మరీ.. ఎనర్జిటిక్ గా ఉండడం ఆయనకే చెల్లింది.

అమితాబ్ బచ్చన్ దాదాపు 200 సినిమాలలో నటించారు. 24 సినిమాలలో పాటలు పాడారు. ఎనిమిది చిత్రాలు నిర్మించారు. సిల్వర్ స్ర్కీన్ కు వచ్చి ఐదున్నర దశాబ్దాలు అయిపోతోంది. అయినా ఇప్పటికీ చేతినిండా సినిమాలు, బుల్లితెర వినోదాలు, రాష్ట్రాలకు సాంస్కృతిక రాయబారిగా, వైద్య ఆరోగ్య శాఖ ప్రకటనల, వాణిజ్య ప్రకటనలు, వాయిస్ ఇవ్వటం. బ్రాండ్ అంబాసిడర్ గా అనేక అవకాశాలు. ఎనభైలోనూ తగ్గని స్టామినాతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వయసులోనూ అమితాబ్ వివిధ భాషల్లో అరడజనుకు పైగానే సినిమాల్లో నటిస్తున్నారు. ఒక్కో సినిమాలో ఒక్కో వెరైటీ పాత్ర చేస్తూ తనమార్క్ ఎమోషన్స్ తో ఆకట్టుకోబోతున్నారు. ఎనభై ఏళ్ళ వయసులోనూ ఎనర్జిటిక్ గా నటించడం అమితాబ్ కే చెల్లింది. అందుకే ఆయన ఇండియన్ సినిమాకే లెజెండ్. ఆయన్నుంచి న్యూ జెన్ హీరోలు నేర్చుకోవల్సింది ఎంతైనా ఉంది.