వర్మకు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పిన బిగ్‌బీ

  • Published By: veegamteam ,Published On : April 8, 2019 / 06:34 AM IST
వర్మకు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పిన బిగ్‌బీ

తెలుగు, హిందీ ఇండస్ట్రీలో దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, గాయకుడిగా తనలోని వివిధ కోణాలను చూపించిన వర్మ త్వరలో కోబ్రా సినిమాతో నటుడిగా వెండి తెరకు పరిచయం కానున్నాడు. ఈ సినిమాలో వర్మ ఇంటిలిజెన్స్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సందర్భంగా ఆదివారం (ఏప్రిల్ 7,2019)న వర్మ పుట్టిన రోజు నాడు అధికారిక ప్రకటన వెలువడింది.

దీంతో వర్మ యాక్టింగ్‌ డెబ్యూ పై బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్ ఆసక్తికరం స్పందించారు. ‘రామ్‌ గోపాల్ వర్మ ద సర్కార్‌ చివరకు తన అసలైన రూట్ కొచ్చారు. నటుడిగా మారుతున్న మీకు ఆల్‌ ద బెస్ట్ సర్కార్‌.. డామ్‌.. నాకు మరొకరు పోటి’ అంటూ అమితాబ్‌ ట్వీట్ చేశారు. తాజాగా ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు వర్మ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ రిలీజ్ అయ్యింది.