Rashmi Gautam : జబర్దస్త్‌కి కొత్త యాంకర్ వచ్చినా నాకు ప్రాబ్లమ్ లేదు.. సౌమ్యతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు..

తాజాగా సౌమ్య రావు అనే కొత్త యాంకర్ ని జబర్దస్త్ కి తీసుకొచ్చారు. పలు సీరియల్స్ లో నటించే సౌమ్యని జబర్దస్త్ కి తీసుకురాగా రష్మీ ఎప్పటిలాగే ఎక్స్ట్రా జబర్దస్త్ కి పరిమితమయింది........

Rashmi Gautam : జబర్దస్త్‌కి కొత్త యాంకర్ వచ్చినా నాకు ప్రాబ్లమ్ లేదు.. సౌమ్యతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు..

Anchor Rashmi Gautam commrents on jabardasth new anchor sowmya rao

Updated On : November 11, 2022 / 7:47 AM IST

Rashmi Gautam :  తెలుగు బుల్లితెర పాపులర్ కామెడీ షో జబర్దస్త్ లో ఇటీవల చాలా మార్పులు వచ్చాయి. కొంతమంది షో నుంచి వెళ్లిపోవడంతో వాళ్ళని రీప్లేస్ చేయడానికి వేరేవాళ్లని తీసుకొస్తున్నారు నిర్వాహకులు. ఇటీవల దాదాపు 10 సంవత్సరాలకి పైగా జబర్దస్త్ కి యాంకరింగ్ చేసిన అనసూయ వెళ్లిపోవడంతో కొన్ని వారాలు రష్మీని జబర్దస్త్ కి యాంకర్ గా చేశారు.

తాజాగా సౌమ్య రావు అనే కొత్త యాంకర్ ని జబర్దస్త్ కి తీసుకొచ్చారు. పలు సీరియల్స్ లో నటించే సౌమ్యని జబర్దస్త్ కి తీసుకురాగా రష్మీ ఎప్పటిలాగే ఎక్స్ట్రా జబర్దస్త్ కి పరిమితమయింది. ఇటీవల తన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ గురించి, సౌమ్య గురించి అడిగటంతో జబర్దస్త్ కి కొత్త యాంకర్ రావడంపై రష్మీ స్పందించింది.

Anusha Shetty : నాగశౌర్య పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరో తెలుసా?? ఎన్ని అవార్డులు సాధించిందో తెలుసా??

రష్మీ మాట్లాడుతూ.. ”సౌమ్య వస్తుందని నాకు ముందే చెప్పారు. అనసూయ వెళ్ళిపోయాక కొన్ని రోజులు నన్ను జబర్దస్త్ కి కూడా యాంకరింగ్ చేయమన్నారు. ఆ తర్వాత వేరే యాంకర్ ని తీసుకొస్తామని కూడా చెప్పారు. సౌమ్య రావడాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఒకవేళ సౌమ్య తన సీరియల్స్ తో బిజీగా ఉండి డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోయినా నేను మళ్ళీ జబర్దస్త్ చేస్తాను. మల్లెమాల సంస్థ నా హోమ్ ప్రొడక్షన్ లాంటిది. అక్కడ నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు” అని తెలిపింది.