Adipurush: ‘ఆదిపురుష్’లో మరో బాలీవుడ్ స్టార్ కన్ఫర్మ్!

బాహుబలితో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు చేసే సినిమాలన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలే. ఇప్పటికే మూడు, నాలుగు భారీ సినిమాలను లైన్లో పెట్టగా అందులో ఆదిపురుష్ కూడా ఒకటి. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్ర చేస్తుండగా కృతి సనన్ సీతగా కనిపించనుంది.

Adipurush: ‘ఆదిపురుష్’లో మరో బాలీవుడ్ స్టార్ కన్ఫర్మ్!

Adipurush

Adipurush: బాహుబలితో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు చేసే సినిమాలన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలే. ఇప్పటికే మూడు, నాలుగు భారీ సినిమాలను లైన్లో పెట్టగా అందులో ఆదిపురుష్ కూడా ఒకటి. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్ర చేస్తుండగా కృతి సనన్ సీతగా కనిపించనుంది. సైఫ్‌ అలీఖాన్‌ రావణుడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

కరోనా సెకండ్ వేవ్ అనంతరం ప్రస్తుతం ముంబైలో ముమ్మర షూటింగ్ లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ వచ్చినా ఇండియన్ సినిమా మొత్తం ఆసక్తిగా చూస్తుంది. ఇప్పటికే రాముడిగా నటిస్తున్న ప్రభాస్ పోస్టర్, రావణుడిగా లంకేష్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్ సినిమా మీద భారీ అంచనాలను పెంచేయగా అందుకు తగ్గట్లే దర్శకుడు ఓంరౌత్ నటీనటుల ఎంచుకుంటున్నాడు.

ఆ మధ్య బాలీవుడ్ ప్రముఖ నటుడు సిద్దార్థ్ శుక్లా ఓ కీలక పాత్రలో నటించనున్నాడని గాసిప్ బయటకి రాగా దానిని సిద్దార్ధ్ ఖండించాడు. అయితే ఇప్పుడు మరో స్టార్ నటుడు నటించడం కన్ఫర్మ్ అయింది. టార్జాన్ ది వండర్ కార్, సల్మాన్ జైహో, లేటెస్ట్ గా మాలాంగ్ వంటి ఎన్నో చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు వత్సల్ సేథ్ ఆదిపురుష్ లో నటిస్తున్నట్టుగా తెలిపాడు. దర్శకుడు ఓంరౌత్ తో కలిసి కొత్త ఆరంభాలు చేస్తున్నాం అంటూ ట్వీట్ చేశాడు. దీనితో ఈ నటుడు కూడా ఈ ఈ సినిమాలో భాగం అని కన్ఫర్మ్ అయ్యింది.