Allari Naresh : ‘అనుకున్నవన్నీ జరగవు కొన్ని’.. కామెడీ సినిమా కోసం అల్లరి నరేష్..

శ్రీరామ్‌ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం 'అనుకున్నవన్ని జరగవు కొన్ని'. తాజాగా ఈ చిత్రం పోస్టర్‌ను అల్లరి నరేష్‌ విడుదల చేశారు.

Allari Naresh : ‘అనుకున్నవన్నీ జరగవు కొన్ని’.. కామెడీ సినిమా కోసం అల్లరి నరేష్..

Anukunnavanni Jaragavu Konni Movie Poster Launch by Allari Naresh

Updated On : October 20, 2023 / 7:31 PM IST

Allari Naresh : శ్రీరామ్‌ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం ‘అనుకున్నవన్నీ జరగవు కొన్ని’. శ్రీ భారత ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జి.సందీప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం పోస్టర్‌ను అల్లరి నరేష్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అనుకున్నవన్నీ జరగవు కొన్ని’ టైటిల్‌ లాంచ్  చేయడం ఆనందంగా ఉంది. పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు నేను నటించిన ‘సిల్లీ ఫెలోస్‌’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా విజయవంతమై టీమ్‌ అందరికీ మంచి పేరు రావాలి. దర్శకుడిగా సందీప్‌ బిజీ కావాలి అని అన్నారు.

హీరో శ్రీరామ్‌ నిమ్మల మాట్లాడుతూ.. క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ఇది. నరేష్‌ గారు క్రైమ్‌, కామెడీ జానర్‌ చిత్రాలెన్నో చేశారు. ఈ టైటిల్‌ లాంచ్  చేయడానికి ఆయనే కరెక్ట్‌ అనిపించింది. సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. నవంబర్‌ 3న సినిమాను విడుదల చేస్తున్నాం అని తెలిపారు.

Also Read : Anand – Vaishnavi : ‘బేబీ’ కాంబో మళ్ళీ తిరిగొస్తుంది.. ఫస్ట్ లుక్ తోనే అదరగొట్టారుగా..

Anukunnavanni Jaragavu Konni Movie Poster Launch by Allari Naresh

దర్శకుడు సందీప్‌ మాట్లాడుతూ.. దర్శకుడిగా తొలి చిత్రమిది. క్రైమ్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించాం. ఆరిస్ట్‌లు అంతా అద్భుతంగా యాక్ట్‌ చేశారు. అందరికీ ఈ చిత్రం నచ్చుతుంది. కామెడీని బాగా ఎంజాయ్‌ చేస్తారు. నవంబర్‌ 3న విడుదల కానున్న మా చిత్రాన్ని తప్పకుండా థియేటర్స్‌లో చూడండి. మా సినిమా పోస్టర్‌ విడుదల చేసిన నరేష్‌ గారికి థ్యాంక్స్‌ అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్  మౌనిక, పలువురు చిత్రయూనిట్ పాల్గొన్నారు.