Chiranjeevi Anushka: మరోసారి మెగాస్టార్‌తో జతకట్టనున్న జేజెమ్మ!

తెలుగులో స్టార్ హీరోలలో సీనియర్ హీరోలు ఇప్పుడు పెద్ద సమస్య పేస్ చేస్తున్నారు. యంగ్ హీరోల కోసం కొత్తగా వచ్చే హీరోయిన్స్ తో పాటు ప్రస్తుతం స్టార్ స్టేటస్ అనుభవించే హీరోయిన్స్..

Chiranjeevi Anushka: మరోసారి మెగాస్టార్‌తో జతకట్టనున్న జేజెమ్మ!

Chiranjeevi Anushka

Chiranjeevi Anushka: తెలుగులో స్టార్ హీరోలలో సీనియర్ హీరోలు ఇప్పుడు పెద్ద సమస్య పేస్ చేస్తున్నారు. యంగ్ హీరోల కోసం కొత్తగా వచ్చే హీరోయిన్స్ తో పాటు ప్రస్తుతం స్టార్ స్టేటస్ అనుభవించే హీరోయిన్స్ సిద్ధంగానే ఉన్నారు. కానీ, సీనియర్ హీరోలకు మాత్రం హీరోయిన్స్ దొరకడం లేదు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ హీరోయిన్స్ దొరక్క ఆపసోపాలు పడుతున్నారు. ఫ్రెష్ మొహాలు, కొత్తగా వచ్చే హీరోయిన్స్ ను తీసుకుంటే స్టేటస్ సమస్యతో పాటు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. పోనీ స్టార్ హీరోయిన్స్ ను తీసుకుందామంటే మరీ చూసేందుకు ఏజ్ గ్యాప్ ఈజీగా కనిపిస్తుంది.

Samantha-Akshay: సమంత ఇంట్లో అక్షయ్ దొంగతనం.. ఇదేం పాడు బుద్దని పోస్ట్!

దీంతో నాగార్జున రమ్యకృష్ణ లాంటి వాళ్ళతో సై అంటుంటే వెంకటేష్ మీనా, ప్రియమణి లాంటి సీనియర్ హీరోయిన్స్ తో సరిపెట్టుకుంటున్నారు. ఇక బాలకృష్ణ అయితే.. ఎలాంటి మొహమాటం లేకుండా ఎవరైనా ఒకే అంటూ దర్శక, నిర్మాతల మీద నెట్టేస్తున్నాడు. చిరంజీవి చేతిలో ఇప్పుడు నాలుగైదు సినిమాలున్నాయి. ఆచార్య చివరి దశలో ఉండగా రీమేక్స్ అయినా గాడ్ ఫాదర్, భోళాశంకర్ షూటింగ్ లో ఉన్నాయి. ఇందులో గాడ్ ఫాదర్ ఒరిజినల్ లూసిఫర్ లో మోహన్ లాల్ కు హీరోయిన్ లేదు. కానీ.. ఇక్కడ మెగా ఫ్యాన్స్ కోసం హీరోయిన్ పాత్రను సృష్టించారు.

Movie Releases: ఫిబ్రవరి సినిమాలూ కష్టమే.. మళ్ళీ తప్పని వాయిదాల పర్వం!

కానీ.. గాడ్ ఫాదర్ లో మెగాస్టార్ పక్కన నటించేందుకు హీరోయిన్ ఇంకా దొరకలేదు. భోళా శంకర్ కోసం సైరా కాంబినేషన్ తమన్నాను రిపీట్ చేశారు. బాబీ దర్శకత్వం రాబోయే సినిమా కోసం శృతిహాసన్ ఒకే చెప్పడంతో కొంత సేఫ్ అయ్యారు. కాగా.. మెగాస్టార్ యంగ్ దర్శకుడు వెంకీ కుడుములతో ఒక సినిమా చేయనున్నాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం హీరోయిన్ వేట సాగిస్తున్నా ఎవరూ చిక్కడం లేదట. గతంలో స్టాలిన్ సినిమాలో నటించిన అనుష్క కోసం మేకర్స్ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా జేజెమ్మ ఇంకా ఒకే చెప్పలేదట.

Ghani: వరుణ్‌తో మిల్కీ బ్యూటీ.. మాస్ మసాలా ఐటెం నెంబర్!

నిజానికి గాడ్ ఫాదర్ సినిమాలోనే చిరంజీవి కోసం అనుష్క పేరు వినిపించింది. అయితే.. ఒరిజినల్ లేని క్యారెక్టర్ కావడం.. అది కూడా పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర కావడంతో అనుష్క చేయడం కష్టమేనని టాక్ నడించింది. అయితే.. వెంకీ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా బలంగా ఉంటుందని.. దాదాపుగా అనుష్క ఒకే చెప్పడం ఖాయమనుకుంటున్నారు. ఒకవేళ అనుష్క నో చెప్తే మాత్రం కాస్త ఖర్చైనా బాలీవుడ్ భామలను దింపేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.