CBSE : సినిమాలు చేస్తూనే..CBSE పరీక్షల్లో సత్తా చాటిన బాలీవుడ్ నటి..

సీబీఎస్ఈ ఫలితాల్లో బాలీవుడ్ నటి సత్తా చాటింది. సినిమా, సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉండే ఈ భామ చదువుల్లోనూ తన ప్రతిభను చూపెడుతోంది. ఇటీవలే ప్రకటించిన సీబీఎస్ఈ ఫలితాల్లో ఏకంగా 94 శాతం మార్కులు సాధించారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే..మంచి మార్కులు సాధించిన ఈ భామపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

CBSE : సినిమాలు చేస్తూనే..CBSE పరీక్షల్లో సత్తా చాటిన బాలీవుడ్ నటి..

Ashnoor

Ashnoor Kaur : సీబీఎస్ఈ ఫలితాల్లో బాలీవుడ్ నటి సత్తా చాటింది. సినిమా, సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉండే ఈ భామ చదువుల్లోనూ తన ప్రతిభను చూపెడుతోంది. ఇటీవలే ప్రకటించిన సీబీఎస్ఈ ఫలితాల్లో ఏకంగా 94 శాతం మార్కులు సాధించారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే..మంచి మార్కులు సాధించిన ఈ భామపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే వారు చదువుపై అంత శ్రద్ధ పెట్టరు. షూటింగ్ లో బిజీగా ఉంటూ..ఎప్పుడు చదువుకొనేది అంటూ కొందరంటుంటారు.

Read More : MLA Comment: ‘ఎలక్ట్రిసిటీ వద్దు.. నాకు ఎమ్మెల్యే కావాలి’ అడిగిన మహిళకు ఎమ్మెల్యే రిప్లై

చదువు వేరు, నటన వేరని నిరూపిస్తున్నారు. బాలీవుడ్ నటి అష్నూర్ కౌర్.. సినిమాలతో పాటు సీరియల్స్ లో నటిస్తున్నారు. ఝాన్సీకి రాణి, యే రిస్తా క్యా కహ్లాతా హై, పాటియాల జేబ్స్ లాంటి సీరియల్స్ తో పాటు..సినిమాల్లో నటిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ లో పాల్గొంటూ..బిజీగా ఉంటూనే..చదువుపై శ్రద్ధ పెట్టారు ఈ నటి. సీబీఎస్ఈ పరీక్షలు రాసింది. మొత్తం 94 శాతం మార్కులు సాధించారు. ఫలితాలపై నటి అష్నూర్ కౌర్ స్పందించారు. ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించలేదని, చాలా కష్టపడి పరీక్షలు రాసినట్లు చెప్పారు.

Read More :Zika Virus: మహారాష్ట్రలో తొలి జికా వైరస్ కేసు.. అదే వ్యక్తికి చికెన్ గున్యా

పదో తరగతి పరీక్షల్లో 93 శాతం మార్కులు వచ్చాయని, 12వ తరగతిలో అంతకంటే..ఎక్కువగా మార్కులు సాధించాలని అనుకున్నట్లు తెలిపారు. కష్టపడి చదివి..మంచి మార్కులు సాధించినందుకు సంతోషంగా ఉందని, చదువుని ఇంతటితో ఆపాలని అనుకోవడం లేదన్నారు. నటిస్తూ వచ్చిన డబ్బు జమ చేస్తూ…సొంత ఇంటిని కూడా కట్టుకుంది. 17 ఏళ్ల వయస్సులో తన సొంత డబ్బుతో ఇల్లుని కొనుక్కుందట. ఇంటి పనులు పూర్తి చేసుకుని…వచ్చే సంవత్సరంలో గృహ ప్రవేశం ప్లాన్ చేస్తున్నట్లు అష్నూర్ కౌర్ పేర్కొన్నారు.