‘అతడే శ్రీమన్నారాయణ’ – హ్యాండ్స్ అప్ వీడియో సాంగ్

రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్న ‘అతడే శ్రీమన్నారాయణ’ సినిమాలోని హ్యాండ్స్ అప్ వీడియో సాంగ్ విడుదల..

  • Published By: sekhar ,Published On : December 13, 2019 / 10:27 AM IST
‘అతడే శ్రీమన్నారాయణ’ – హ్యాండ్స్ అప్ వీడియో సాంగ్

రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్న ‘అతడే శ్రీమన్నారాయణ’ సినిమాలోని హ్యాండ్స్ అప్ వీడియో సాంగ్ విడుదల..

కన్నడ నాట సంచలన విజయం సాధించిన చిత్రం ‘కిరిక్ పార్టీ’.. ఈ సినిమా హీరో రక్షిత్ శెట్టి ‘అవనే శ్రీమన్నారాయణ’ అనే సినిమా  చేస్తున్నాడు. ‘లవ్ లీ’, ‘అడ్డా’, ‘రౌడీ’ సినిమాల్లో నటించిన శాన్వీ కథానాయిక.. పుష్కర్ ఫిలింస్ పతాకంపై మఖార్జునయ్య నిర్మిస్తుండగా, సచిన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘అతడే శ్రీమన్నారాయణ’ పేరుతో రిలీజ్ కానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. తాజాగా ‘హ్యాండ్స్ అప్’ అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.

Image

రక్షిత్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఓ నిధి నేపథ్యంలో అడ్వెంచరస్‌గా తెరకెక్కుతుందీ చిత్రం.. అజనీష్ లోక్‌నాధ్ ట్యూన్ కంపోజ్ చేయగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. విజయ్ ప్రకాశ్ చాలా బాగా పాడారు. శశాంక్, పంచం జీవా, చతన్ నాయక్ తదితరులు కోరస్ పాడారు. విజువల్స్, ఆర్ఆర్, వీఎఫ్ఎక్స్, రక్షిత్ డ్యాన్స్ మూమెంట్స్ బాగున్నాయి. ఆకట్టుకునే కథా కథనాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.

‘కేజీఎఫ్’ తర్వాత అంత భారీగా తెరకెక్కిన కన్నడ చిత్రం ఇదే కావడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి. కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ బాషల్లో ‘అతడే శ్రీమన్నారాయణ’ విడుదల కానుంది. మ్యూజిక్ : అజనీష్ లోక్‌నాధ్, డీఓపీ : కర్మ్ చావ్లా, లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి.