Athulya Ravi: ‘మీటర్’ అందరినీ ఆకట్టుకుంటుంది.. పైసా వసూల్ మూవీ అంటోన్న తమిళ బ్యూటీ!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘మీటర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో తన పాత్ర గురించి తాజాగా హీరోయిన్ అతుల్య రవి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను మీడియాతో పంచుకుంది.

Athulya Ravi: ‘మీటర్’ అందరినీ ఆకట్టుకుంటుంది.. పైసా వసూల్ మూవీ అంటోన్న తమిళ బ్యూటీ!

Athulya Ravi Confident On Meter Movie Success

Athulya Ravi: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘మీటర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు రమేష్ కాడూరి తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ‘మీటర్’ రానుంది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం తొలిసారి ఓ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

Meter Movie: ట్రైలర్‌తో ‘మీటర్‌’ను మరింత పెంచేందుకు రెడీ అయిన కిరణ్ అబ్బవరం

కాగా, ఈ సినిమా గురించి.. ఇందులో తన పాత్ర గురించి తాజాగా హీరోయిన్ అతుల్య రవి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను మీడియాతో పంచుకుంది. మీటర్ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని.. అబ్బాయిలంటే ఏమాత్రం ఇష్టం లేని అమ్మాయిగా తాను కనిపిస్తానని.. అయితే, తన పాత్ర సీరియస్‌గా ఉన్నప్పటికీ, కామెడీని పండిస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక కిరణ్ అబ్బవరంతో తన సీన్స్ చాలా బాగా ఉంటాయని.. తమ కాంబినేషన్ చాలా సరదాగా సాగుతుందని ఆమె తెలిపింది. మాస్, ఎమోషనల్ అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని.. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ సినిమా సాగుతుందని అతుల్య తెలిపింది.

Meter Movie: మరో అప్డేట్‌తో దూసుకొస్తున్న కిరణ్ అబ్బవరం.. మీటర్ ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?

కమర్షియల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని.. ఈ సినిమాను చూస్తున్నంత సేపు వారు అన్ని టెన్షన్లు పక్కనపెట్టి సినిమాను ఎంజాయ్ చేస్తారని అతుల్య రవి చెప్పుకొచ్చింది. ఈ సినిమా తప్పకుండా పైసా వసూల్ మూవీగా ఉంటుందని ఆమె కాన్ఫిడెంట్‌గా తెలిపింది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న అతుల్య రవి, సినిమాలో తన పాత్రతో ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక మీటర్ చిత్రాన్ని ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.