పొరపాటున ‘పవర్‌స్టార్’ను లైక్ చేశా.. క్షమించండి!

  • Published By: sekhar ,Published On : July 25, 2020 / 01:36 PM IST
పొరపాటున ‘పవర్‌స్టార్’ను లైక్ చేశా.. క్షమించండి!

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన ‘పవర్‌స్టార్’ సినిమా ట్రైలర్ వైరల్‌గా మారింది. రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటోంది. ట్రైలర్‌లో బండ్ల గణేష్‌ను పోలిన వ్యక్తిని కూడా చూపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి వర్మ తాజాగా విడుదల చేసిన వీడియోను బండ్ల గణేష్ లైక్ చేయడం పవన్ అభిమానులకు షాకింగ్‌గా మారింది.

Powerstar

వర్మ తాజాగా విడుదల చేసిన ‘బ్రదర్స్ వీడియో’కు బండ్ల గణేష్ లైక్ కొట్టాడు. ఓ అభిమాని దీని గురించి ట్విట్టర్ ద్వారా బండ్ల గణేష్‌ను ప్రశ్నించాడు. ‘బండ్ల అన్నా.. ఈ వీడియోను ఎందుకు లైక్ చేసినవ్’ అని అడిగాడు. దీనికి స్పందించిన బండ్ల.. ‘ఒట్టు.. ఏదో పొరపాటున జరిగింది. నేనెప్పుడూ ఇలా చేయను. జరిగిన దానికి క్షమించండ’ని రిప్లై ఇచ్చాడు. వర్మ తెరకెక్కించిన ‘పవర్‌ స్టార్’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.