Bandla Ganesh Tweet on Pawan Kalyan : మీరు రికార్డులు తిరగరాసే సినిమా త్వరగా తీయాలి.. పవన్ పై బండ్ల గణేష్ ట్వీట్..

తాజాగా పవన్ త్వరగా సినిమాలు తీయాలంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ట్వీట్ లో.. ''నా దైవ సమానులైన మా పవన్ కళ్యాణ్. మీరు తెలుగు చలన చిత్ర చరిత్రలో..........

Bandla Ganesh Tweet on Pawan Kalyan : మీరు రికార్డులు తిరగరాసే సినిమా త్వరగా తీయాలి.. పవన్ పై బండ్ల గణేష్ ట్వీట్..

 

Bandla Ganesh Tweet on Pawan Kalyan :  చాలా గ్యాప్ తీసుకొని వకీల్ సాబ్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చి ఆ తర్వాత భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ ని నింపారు పవన్ కళ్యాణ్. వరుస సినిమాలు సైన్ చేసి ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచారు. కానీ ఆ సినిమాలు షూటింగ్ లో ఉన్నప్పుడే కరోనా రావడం, ఆ తర్వాత పవన్ పాలిటిక్స్ తో బిజీ అయిపోవడంతో పవన్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు ఉంటుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.

పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి సెట్స్ మీద ఉంది. అది ఎప్పుడవుతుందో ఎవ్వరికి క్లారిటీ రావట్లేదు. ఇక మిగిలిన సినిమాలు అయితే ఇప్పట్లో కష్టమే అన్నట్టు ఉన్నాయి. పవన్ ఫుల్ టైం పాలిటిక్స్ మీద ఫోకస్ చేస్తుండటంతో సినిమాలు రావట్లేదని పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇక పవన్ కి భక్తుడు అని చెప్పుకునే బండ్ల గణేష్ కూడా పవన్ త్వరగా సినిమాలు తీయాలని కోరుకుంటున్నాడు.

Dhanush : మరో హాలీవుడ్ సినిమాలో ధనుష్.. గ్రే మ్యాన్ సీక్వెల్ లో..

తాజాగా పవన్ త్వరగా సినిమాలు తీయాలంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ట్వీట్ లో.. ”నా దైవ సమానులైన మా పవన్ కళ్యాణ్. మీరు తెలుగు చలన చిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే సినిమా త్వరగా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ప్రేమిస్తూ మీ ప్రేమను పొందుతూ సినిమా తీస్తే బాక్స్ బద్దలే.” అంటూ బండ్ల గణేష్ పోస్ట్ చేశాడు. దీనికి పవన్ తో గబ్బర్ సింగ్ టైంలో పని చేసే ఫోటోని షేర్ చేశాడు. మరి బండ్ల గణేష్ లాగే పవన్ సినిమాలు త్వరగా తీయాలనే ఫ్యాన్స్ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.