Dhanush : మరో హాలీవుడ్ సినిమాలో ధనుష్.. గ్రే మ్యాన్ సీక్వెల్ లో..

గ్రే మ్యాన్ సీక్వెల్‌గా ‘లోన్‌ వోల్ఫ్‌’ రాబోతుందని ప్రకటించారు. అయితే ఈ గ్రే మ్యాన్ సీక్వెల్ లో కూడా ధనుష్ నటిస్తున్నట్టు స్వయంగా ప్రకటించాడు. దీనికి సంబంధించి తన సోషల్ మీడియాలో.........

Dhanush : మరో హాలీవుడ్ సినిమాలో ధనుష్.. గ్రే మ్యాన్ సీక్వెల్ లో..

Dhanush :  తమిళ్ స్టార్ ధనుష్ తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూనే తెలుగు, హిందీలో కూడా సినిమాలు చేస్తున్నాడు. అంతే కాకుండా ఇటీవల హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా వరుస సినిమాలు చేయడానికి ప్రిపేర్ అయిపోతున్నాడు. ఇటీవలే హాలీవుడ్‌ మూవీ ‘ది గ్రే మ్యాన్’ సినిమాలో ధనుష్ నెగిటివ్ రోల్ లో నటించాడు. ది గ్రే మ్యాన్ సినిమా జులై 22 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇందులో ధనుష్ ప్రీ క్లైమాక్స్ లో ఒక 20 నిమిషాలు కనిపించి తన స్టైలిష్ ఫైట్స్ తో ఆకట్టుకున్నాడు.

ఇండియాలో మార్కెట్ కోసం ది గ్రే మ్యాన్ సినిమాని తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేశారు. అంతే కాక భారత్ లో ఈ సినిమా ప్రమోషన్స్ కి ఏకంగా ఈ సినిమాని డైరెక్ట్ చేసిన ఎవెంజర్స్ డైరెక్టర్స్ రూసో బ్రదర్స్‌ ని కూడా తీసుకొచ్చారు. దీంతో ఈ సినిమాకి ఇండియాలో మంచి మార్కెట్ అయి నెట్ ఫ్లిక్స్ కి లాభమే చేకూరింది. ‘గ్రే మ్యాన్‌’ సినిమాతో హాలీవుడ్‌లోనూ తన సత్తా నిరూపించుకున్నాడు ధనుష్‌.

Naga Chaitanya : నేను మళ్ళీ ప్రేమలో పడతాను.. బతకడానికి ఊపిరి ఎంత అవసరమో ప్రేమ కూడా అంతే..

ఇప్పుడు గ్రే మ్యాన్ సీక్వెల్‌గా ‘లోన్‌ వోల్ఫ్‌’ రాబోతుందని ప్రకటించారు. అయితే ఈ గ్రే మ్యాన్ సీక్వెల్ లో కూడా ధనుష్ నటిస్తున్నట్టు స్వయంగా ప్రకటించాడు. దీనికి సంబంధించి తన సోషల్ మీడియాలో ఓ ఆడియో పోస్ట్ చేశాడు. ఈ ఆడియోలో గ్రే మ్యాన్ సీక్వెల్ రాబోతుంది. అందులో కూడా నేను నటించబోతున్నాను అని తెలిపాడు. దీంతో హాలీవుడ్ లో ధనుష్ కి మరిన్ని అవకాశాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. దీంతో ధనుష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.