Kajal Aggarwal : ఎన్నో ఎమోషన్స్‌ని.. కార్మికుల ప్రేమతో.. కాజల్ ఎమోషనల్ పోస్ట్..

మొన్నటి వరకు 'భగవంత్ కేసరి' సినిమా ప్రమోషన్స్ లో కనిపించిన ఈ చందమామ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ వేసింది. కాజల్ చేసిన పోస్టు ఈ విషయం గురించి..?

Kajal Aggarwal : ఎన్నో ఎమోషన్స్‌ని.. కార్మికుల ప్రేమతో.. కాజల్ ఎమోషనల్ పోస్ట్..

Bhagavanth Kesari actress Kajal Aggarwal emotional post in her instagram

Updated On : October 29, 2023 / 8:47 PM IST

Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత కొంచెం గ్యాప్ తీసుకోని ఒక బాబుకి జన్మనిచ్చి.. మళ్ళీ తిరిగి నటన మొదలు పెట్టి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. రీసెంట్ గా బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమాలో హీరోయిన్ గా నటించి సూపర్ హిట్టుని అందుకుంది. మొన్నటి వరకు ఆ సినిమా ప్రమోషన్స్ లో కనిపించిన ఈ చందమామ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ వేసింది. కాజల్ చేసిన పోస్టు ఈ విషయం గురించి..?

కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి కొంత ఇంటిలోకి అడుగు పెట్టారు. ఆ గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఆ ఇంటితో ఉన్న ఎమోషనల్ జర్నీ గురించి తెలియజేసింది. “గత వరం నుంచి ఈ గృహప్రవేశంతో ఎన్నో ఎమోషన్స్ ని నేను నీతో (గౌతమ్ కిచ్లు) షేర్ చేసుకున్నాను. కార్మికుల ప్రేమతో నిర్మించబడిన ఈ ఇంటిలో మనం ఉండబోతునందుకు నేను ఎంతో గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాను” అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది.

Also read : Salman – Ronaldo : ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు సూపర్ స్టార్స్.. బాక్సింగ్ మ్యాచ్‌లో సల్మాన్ ఖాన్, క్రిస్టియానో ​​రొనాల్డో..

ఇక కాజల్ షేర్ చేసిన ఫొటోల్లో ఆమె కుమారుడు నీల్ కిచ్లు, సోదరి నిషా అగర్వాల్, మరికొందరు కుటుంబసభ్యులు కనిపిస్తున్నారు. ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే.. కమల్ హాసన్ తో ‘ఇండియన్ 2’ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దమవుతుంది. అలాగే హిందీలో ‘ఉమా’, తెలుగులో ‘సత్యభామ’ అనే రెండు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో నటిస్తుంది. ఆ మధ్య సత్యభామ నుంచి రిలీజ్ అయిన ఒక చిన్న గ్లింప్స్ కాజల్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమాలో కాజల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)