RRR: రామరాజుతో భీమ్.. త్వరలోనే ఒకే టీజర్‌లో ఇద్దరూ!

తెలుగు సినిమాతో పాటు యావత్ ఇండియన్ సినీ లోకం ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు నటీనటులను రప్పించిన రాజమౌళి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తెస్తాడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు సినీ అభిమానులు.

RRR: రామరాజుతో భీమ్.. త్వరలోనే ఒకే టీజర్‌లో ఇద్దరూ!

Rrr

RRR: తెలుగు సినిమాతో పాటు యావత్ ఇండియన్ సినీ లోకం ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు నటీనటులను రప్పించిన రాజమౌళి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తెస్తాడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు సినీ అభిమానులు. కరోనా ప్రభావంతో కాస్త వెనక్కు తగ్గినా అనుకున్న సమయానికే సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని యూనిట్ ఘంటాపదంగా చెప్తుంది.

అందుకు తగ్గట్లే ఈ మధ్యనే మళ్ళీ రామరాజు, భీమ్ కలిసి షూటింగ్ స్పాట్ లో అడుగుపెట్టారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే రామరాజు ఫర్ భీమ్.. భీమ్ ఫర్ రామరాజు అంటూ టీజర్లు విడుదల చేయగా ఇవి యూట్యూబ్ లో పాత రికార్డులకు తిరగరాసి చరిత్ర సృష్టించాయి. కాగా ఇప్పుడు మిగిలింది ఇద్దరినీ ఒకే టీజర్ లో చూడడమే. ఇందుకోసమే ఇప్పుడు ప్రేక్షక లోకం ఎంతగానో ఎదురుచూస్తుంది. ఇప్పుడు ఆ ఘడియలు కూడా రానే వచ్చాయనిపిస్తుంది.

ఆంగ్లేయుల అరాచక పాలన నుండి విముక్తి పొందిన ఆగష్టు 15 భారతీయులకు ఓ మరపురాని రోజు. రామరాజు, కొమరం భీమ్ కథనరంగం వేరైనా ఇద్దరూ స్వతంత్రం కోసం పోరాడిన యోధులే కనుక ఆర్ఆర్ఆర్ టీజర్ కూడా అదే రోజున తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారట. ఈలోగా సినిమా అప్పటికి షూటింగ్ కూడా పూర్తి కానుండగా అక్టోబర్ లో సినిమా విడుదల చేయనున్నారు. అంటే ఆగస్టు నుండి ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో ఉండనున్నాయి. అది ఆగష్టు 15న హిస్టారికల్ టీజర్ తోనే మొదలవనున్నట్లుగా కనిపిస్తుంది.