Suriya: సూర్య 42వ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ రానుందా..?

తమిళ స్టార్ హీరో సూర్య నటించే సినిమాలకు కేవలం తమిళనాటే కాకుండా తెలుగులోనూ మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఇక సూర్య నటిస్తున్న తాజా చిత్రం గురించిన అప్డేట్ కోసం సూర్య అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Suriya: సూర్య 42వ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ రానుందా..?

Big Update On The Way From Suriya 42 Movie

Suriya: తమిళ స్టార్ హీరో సూర్య నటించే సినిమాలకు కేవలం తమిళనాటే కాకుండా తెలుగులోనూ మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఇక సూర్య నటిస్తున్న తాజా చిత్రం గురించిన అప్డేట్ కోసం సూర్య అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Suriya 42 : సూర్య సినిమా హిందీ రైట్స్ 100 కోట్లకు అమ్ముడుపోయాయ?

ఇక ఈ సినిమాలో సూర్య ఏకంగా 10 డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమా నుండి త్వరలోనే ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించిన టైటిల్‌ను త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Suriya : డబ్బింగ్ ఆర్టిస్ట్ మరణం.. హీరో సూర్య ఎమోషనల్ పోస్ట్!

ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ఈ నెల రెండో వారంలో మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట. స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన కీలక పోర్షన్‌ను మార్చి, ఏర్పిల్ నెలలో షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాకు చిత్ర యూనిట్ ఎలాంటి టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.