Bigg Boss 5 : గేట్లు తెరిచి బయటకి వెళ్ళిపోమన్న బిగ్ బాస్.. షాక్ లో కంటెస్టెంట్స్..

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంతకుముందు ఒకసారి సీక్రెట్ రూమ్ లో కంటెస్టెంట్స్ ని పెట్టి మాట్లాడించాడు. ఈ సారి కూడా అందర్నీ సీక్రెట్ రూమ్ లోకి పంపి

Bigg Boss 5 :  గేట్లు తెరిచి బయటకి వెళ్ళిపోమన్న బిగ్ బాస్.. షాక్ లో కంటెస్టెంట్స్..

Bb Elimination

Bigg Boss 5 :  బిగ్ బాస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కాదు. ఎప్పటికప్పుడు కొత్త టాస్కులు ఇస్తూ కంటెస్టెంట్స్ మధ్యలో గొడవలు పెడుతూ ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు బిగ్ బాస్. ఈ వారం పది మంది నామినేషన్లోకి వచ్చారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. అందులో ట్విస్ట్ లు కూడా ఉండొచ్చు అనిపిస్తుంది.

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంతకుముందు ఒకసారి సీక్రెట్ రూమ్ లో కంటెస్టెంట్స్ ని పెట్టి మాట్లాడించాడు. ఈ సారి కూడా అందర్నీ సీక్రెట్ రూమ్ లోకి పంపి బిగ్ బాస్ నుంచి ఎవర్ని పంపించేద్దాం అనుకుంటున్నారు అని అడిగాడు నాగార్జున. అందరూ ఆలోచించి చెప్పారు. అయితే ఎవరు ఎవరి పేర్లు చెప్పారో ప్రోమోలో రివీల్ చేయలేదు. సీక్రెట్ రూమ్ లో అడిగారు కాబట్టి ఎవరు ఎవరి పేరు చెప్పారో కంటెస్టెంట్స్ ఎవరికీ తెలీదు. ఇలా అందర్నీ అడిగి అందరి ముందు ప్రియ, లోబోలకి సమానంగా ఓట్లు వచ్చాయి అని చెప్పాడు. ఇక ఇద్దరిలో ఎవర్ని పంపించాలో కంటెస్టెంట్స్ ని డిసైడ్ చేయమన్నాడు. ఇంటి సభ్యులు కొంతమంది ప్రియా వైపు, కొంతమంది లోబో వైపు వెళ్లారు. ఇద్దరి వైపు సమానంగా ఉన్నారు. చివరికి అని మాస్టర్ మిగిలింది. అని మాస్టర్ ఎవరి వైపు వెళ్తే వాళ్ళు బయటకి వెళ్ళిపోతారు అని నాగార్జున చెప్పాడు. బిగ్ బాస్ గేట్లు కూడా ఓపెన్ చేశాడు. ఇలా సస్పెన్స్ లో పెట్టి ప్రోమో ముగించాడు. ఇవాళ రాబోయే ఎపిసోడ్ లో తెలుస్తుంది ఎవరు బయటకి వెళ్ళిపోతారో.

MAA Elections 2021 : ఎన్టీఆర్ తర్వాత మోహన్ బాబే లెజెండ్ : ‘మా’ ఎన్నికల అధికారి

అయితే మూడో సీజన్‌లో ఇలాంటిదే ఓ టాస్క్ చేశారు. అప్పుడు పునర్నవిని ఇంటి నుంచి బయటకు పంపించాలి అని అందరూ నిర్ణయించారు. ఆమె బ్యాగు సర్దుకుని గేటు దాకా వచ్చేసింది కానీ అదంతా డ్రామా అని చివరికి చెప్పారు. మరి ఈ సారి కూడా అలాగే చేస్తాడా బిగ్ బాస్ అని అనుకుంటున్నారు.