Bigg Boss 5 : బిగ్‌బాస్‌ విన్నర్ సన్నీ ఏమేమి గెలిచుకున్నాడో తెలుసా... | Bigg Boss Winner Sunny winning ifts

Bigg Boss 5 : బిగ్‌బాస్‌ విన్నర్ సన్నీ ఏమేమి గెలిచుకున్నాడో తెలుసా…

నిన్న నాగార్జున చేతుల మీదుగా బిగ్ బాస్ ట్రోఫీని అందుకున్నాడు సన్నీ. ఇక బిగ్ బాస్ విన్నర్ కి ఏమేమి ఇస్తారో ముందే చెప్పేసారు. ముందు చెప్పిన దాని ప్రకారమే విన్నర్ సన్నీకి.........

Bigg Boss 5 : బిగ్‌బాస్‌ విన్నర్ సన్నీ ఏమేమి గెలిచుకున్నాడో తెలుసా…

Bigg Boss 5 :   100 రోజులకి పైగా సాగిన బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ లో సన్నీ విన్నర్ గా గెలిచాడు. నిన్నటితో ఈ బిగ్ బాస్ తంతు పూర్తయింది. రిపోర్టర్ గా తన ప్రయాణం మొదలు పెట్టి తర్వాత ఆర్జేగా, తర్వాత యాంకర్ గా, తర్వాత సీరియల్ యాక్టర్ గా ప్రయాణాన్ని కొనసాగిస్తూ బిగ్ బాస్ వరకు వచ్చాడు. బిగ్ బాస్ లో తన యాటిట్యూడ్, తన యారగెంట్ పర్ఫార్మెన్స్ తో కంటెస్టెంట్స్ కి ఇబ్బందులు కలిగించినా ఇప్పుడు ఉన్న యూత్ కి ఆ యాటిట్యూడ్ పర్ఫార్మెన్స్ నచ్చి, సోషల్ మీడియాలో కూడా బాగా ప్రమోషన్స్ చేసి మొత్తానికి బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు.

నిన్న నాగార్జున చేతుల మీదుగా బిగ్ బాస్ ట్రోఫీని అందుకున్నాడు సన్నీ. నాగార్జున తనే విన్నర్‌ అని చెప్పగానే సంతోషంతో నాగార్జునను ఎత్తుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ ట్రోఫీని స్టేజ్ మీద ఉన్న తన తల్లికి అందించాడు సన్నీ. సన్నీ తల్లి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా సన్నీ పడుతున్న కష్టానికి నేడు ప్రతిఫలం దక్కిందని ఎమోషనల్ అయింది.

Bigg Boss Telugu 5 Winner : మచ్చా గెలిచేశావ్.. బిగ్‌బాస్-5 విజేత వీజే సన్నీ

ఇక బిగ్ బాస్ విన్నర్ కి ఏమేమి ఇస్తారో ముందే చెప్పేసారు. ముందు చెప్పిన దాని ప్రకారమే విన్నర్ సన్నీకి బిగ్ బాస్ ట్రోఫీతో పాటు రూ.50 లక్షల చెక్‌ను అందచేశారు. దీనితో పాటు సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్‌ నుంచి షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల భూమిని కూడా ఇచ్చినట్టు తెలిపారు.ఇవే కాక టీవీఎస్‌ బైక్‌ కూడా గెలుచుకున్నాడని ప్రకటించారు.

×