BiggBoss 6 Launching Episode : గత సీజన్లతో పోలిస్తే దారుణంగా పడిపోయిన బిగ్‌బాస్ లాంచింగ్ ఎపిసోడ్ రేటింగ్.. దానివల్లేనా?

బిగ్‌బాస్ పై ప్రేక్షకులకి గతంలో ఉన్నంత ఆసక్తి ఇప్పుడు లేదని తెలుస్తుంది. ఈ సారి బిగ్‌బాస్ లాంచింగ్ ఎపిసోడ్ సెప్టెంబర్ 4న చేశారు. దీనికి టీఆర్పీ రేటింగ్ మరీ దారుణంగా..........

BiggBoss 6 Launching Episode : గత సీజన్లతో పోలిస్తే దారుణంగా పడిపోయిన బిగ్‌బాస్ లాంచింగ్ ఎపిసోడ్ రేటింగ్.. దానివల్లేనా?

BiggBoss 6 Launching Episode TRP Rating Dropped comparing past seasons

BiggBoss 6 Launching Episode :  బిగ్‌బాస్ రియాల్టీ షోకి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. నాగార్జున హోస్ట్ గా ఇటీవలే ఆరో సీజన్ ని మొదలుపెట్టారు. ఇప్పటికే ఒక వారం పూర్తయి రెండోవారం నడుస్తుంది. సాధారణంగా బిగ్‌బాస్ షో మొదలైతే అందులో కంటెస్టెంట్స్, వాళ్ళకి నామినేషన్స్, వాళ్ళ కోసం సోషల్ మీడియాలో జరిగే ప్రమోషన్స్, వాళ్ళ ఫ్యాన్స్ చేసే రచ్చ ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఈ సారి అంతగా హడావిడి కనిపించట్లేదు. తాజాగా బిగ్‌బాస్ సీజన్ 6 లాంచింగ్ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ రాగా గత సీజన్లతో పోలిస్తే దారుణంగా పడిపోయింది.

బిగ్‌బాస్ పై ప్రేక్షకులకి గతంలో ఉన్నంత ఆసక్తి ఇప్పుడు లేదని తెలుస్తుంది. ఈ సారి బిగ్‌బాస్ లాంచింగ్ ఎపిసోడ్ సెప్టెంబర్ 4న చేశారు. దీనికి టీఆర్పీ రేటింగ్ మరీ దారుణంగా 8.86 వచ్చింది. దీంతో నిర్వాహకులు, టీవీ వర్గాలు ఆశ్చర్యపోయారు. ఒక సాధారణ సీరియల్ కి వచ్చే రేటింగ్ కూడా రాలేదు. అయితే దీనికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నట్టు భావిస్తున్నారు.

BiggBoss 6 Day 11: ఏడుపులు, ఎమోషనల్స్ తో నిండిపోయిన బిగ్‌బాస్.. వీళ్ళ కథలు వింటే మీరు కూడా ఏడవాల్సింది..

గతంతో పోలిస్తే బిగ్‌బాస్ పై ఇప్పుడు జనాలకి ఆసక్తి తగ్గింది. అలాగే ఇప్పుడు అందరూ టీవీల కంటే కూడా ఓటీటీ లలోనే ఈ షోని చూస్తున్నారు. ఇక ఈ షో లాంచింగ్ రోజే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఉండటంతో దానివల్ల కూడా ఈ షో లాంచింగ్ ఎపిసోడ్ కి టీఆర్పీ రేటింగ్ పడిపోయిందని భావిస్తున్నారు.

బిగ్‌బాస్ సీజన్ 1 ఎన్టీఆర్ హోస్ట్ చేయగా లాంచింగ్ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ 16.18 వచ్చింది. బిగ్‌బాస్ సీజన్ 2 నాని హోస్ట్ చేయగా లాంచింగ్ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ 15.05 వచ్చింది. బిగ్‌బాస్ సీజన్ 3 నుంచి వరుసగా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. సీజన్ 3 లాంచింగ్ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ 17.92 వచ్చింది. బిగ్‌బాస్ సీజన్ 4 లాంచింగ్ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ 18.50 వచ్చింది. బిగ్‌బాస్ సీజన్ 5 లాంచింగ్ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ 15.70 వచ్చింది. బిగ్‌బాస్ సీజన్ 6 లాంచింగ్ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్ 8.86 వచ్చింది. గత సీజన్ల కంటే చాలా తక్కువ రావడం గమనార్హం.