Nagarjuna : బిగ్‌బాస్ నాన్ స్టాప్ మొదలయ్యేది ఆ రోజే.. ప్రోమో విడుదల..

తెలుగు బిగ్‌బాస్ సీజన్5 అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్ నుంచి ఓటీటీలో 24/7 లైవ్ టెలికాస్ట్ ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ పేరుతో వస్తుంది అని తెలిపారు. ఈ ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’...........

Nagarjuna : బిగ్‌బాస్ నాన్ స్టాప్ మొదలయ్యేది ఆ రోజే.. ప్రోమో విడుదల..

Nagarjuna

BiggBoss  :  బిగ్‌బాస్ రియాల్టీ షో అన్ని భాషల్లోనూ బాగా క్లిక్ అయింది. అన్ని భాషా ప్రేక్షకులు బిగ్‌బాస్ ని ఆదరిస్తున్నారు. తెలుగులో కూడా ఈ షో మంచి ఆదరణ పొందింది. ఇప్పటికే అయిదు సీజన్లను పూర్తి చేసుకుంది తెలుగు బిగ్‌బాస్. సీజన్ పెరిగే కొద్దీ ప్రేక్షకులు కూడా పెరుగుతున్నారు. టీవిలో బిగ్‌బాస్ షోకి మంచి రేటింగ్ వస్తుంది.

తెలుగు బిగ్‌బాస్ సీజన్5 అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్ నుంచి ఓటీటీలో 24/7 లైవ్ టెలికాస్ట్ ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ పేరుతో వస్తుంది అని తెలిపారు. ఈ ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ రియాల్టీ షో డిస్ని ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో రానుంది. ఇటీవలే ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ నుంచి ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. తాజాగా ఈ రియాల్టీ షో ప్రోమో విడుదల చేశారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని బిగ్ బాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ ఎప్పట్నించి ప్రారంభం అవ్వనుందో తెలుపుతూ ఓ ప్రోమో రిలీజ్ చేశారు.

Adipurush : మన ఇతిహాసాలని జపాన్ వాళ్ళు తీస్తున్నారు.. మనం?.. డైరెక్టర్ ఓంరౌత్ వ్యాఖ్యలు..

‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ రియాల్టీ షో ఫిబ్రవరి 26 సాయంత్రం 6గంటల నుండి డిస్ని హాట్‌స్టార్‌లో టెలికాస్ట్ అవ్వనుంది. ఇప్పటికే ఓపెనింగ్ ప్రోగ్రాం షూటింగ్ కూడా పూర్తయింది. అయితే ఈ సారి ఎవరు ఉండబోతున్నారో ఇంకా పేర్లు రివీల్ చేయకపోయినా కొన్ని పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. ఇందులో కొత్తవాళ్లతో పాటు పాత సీజన్స్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా ఉండబోతున్నారు.

Adipurush : ప్రభాస్ పేరు రాముడు కాదు.. ‘ఆదిపురుష్’పై ఓంరౌత్ వ్యాఖ్యలు..

ఇప్పటికి అయితే వీరి పేర్లు వినిపిస్తున్నాయి… హీరోయిన్ బిందు మాధవి, ధనరాజ్, ఆదర్శ్, ముమైత్ ఖాన్, రోల్‌ రైడా, తేజస్వి, అషు రెడ్డి, అరియానా గ్లోరి, మహేశ్‌ విట్టా, సరయు, హమీదా, నటరాజ్ మాస్టర్, యూట్యూబర్ నిఖిల్, యాంకర్ స్రవంతి, ఆర్జే చైతు, యాంకర్ శివ, చిచ్చా చార్లెస్‌, అజయ్‌ కతుర్వార్‌. అయితే వీరిలో ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు? అసలైన కంటెస్టెంట్స్ ఎవరు అని తెలియాలి అంటే ఫిబ్రవరి 26 సాయంత్రం 6 వరకు ఆగాల్సిందే.