BiggBoss Priyanka : నేను ట్రాన్స్‌జెండర్‌గా మారడం రూపాయి కాయిన్ డిసైడ్ చేసింది : బిగ్ బాస్ ప్రియాంక
బిగ్ బాస్ సీజన్ 5లో ట్రాన్స్‌జెండర్‌గా ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక అలియాస్ సాయి తేజ. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన మొదట్లోనే ప్రియాంక తాను ట్రాన్స్ జెండర్‌గా మారడానికి కారణాలను

Priyanka
BiggBoss Priyanka : బిగ్ బాస్ సీజన్ 5లో ట్రాన్స్‌జెండర్‌గా ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక అలియాస్ సాయి తేజ. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన మొదట్లోనే ప్రియాంక తాను ట్రాన్స్ జెండర్‌గా మారడానికి కారణాలను కంటెస్టెంట్స్ కి వివరించింది. తను ట్రాన్స్‌జెండర్‌గా మారిన విషయాన్ని తన తండ్రికి ఎలా చెప్పాలో అర్ధంకాక చాలా సార్లు బాధపడ్డాను అని చెప్పింది. ఇటీవల ప్రియాంక మనోభావాలను అర్ధం చేసుకున్న తండ్రి ఆమెను హృదయపూర్వకంగా ఒప్పుకున్నారు. ప్రియాంక బర్త్ డే రోజు బిగ్ బాస్ ఓ వీడియో ప్లే చేసింది. అందులో ప్రియాంక తండ్రి మాట్లాడుతూ.. నాన్న సాయితేజ నువ్వు అమ్మాయైన, అబ్బాయైన నువ్వే మా సర్వం అంటూ ఎమోషనల్‌గా మాట్లాడారు. ఆయన మాటలు విని ప్రియాంక చాలా ఎమోషనల్ అయింది. హౌస్ లో ఏడ్చేసింది. తన పాత జ్ఞాపకాలని కంటెస్టెంట్స్ తో పంచుకుంది.
Allu Arjun : మరోసారి అల్లు అర్జున్ బోయపాటి మాస్ కాంబినేషన్.. పుష్ప తర్వాతే??
తన గతాన్ని చెప్తూ సాయి తేజ ప్రియాంకగా మారడం వెనక దైవ నిర్ణయం కూడా ఉందని తెలిపింది. తాను ట్రాన్స్ జెండర్‌గా మారాలని అనుకున్నప్పుడు ఎవరి సలహా తీసుకోవాలో తెలియక జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడికి వెళ్లి అక్కడ అమ్మవారి సన్నిధిలో రూపాయి కాయిన్‌ని నిలబెట్టి మనసులో కోరిక కోరుకున్నాను అని తెలిపింది. ఈ అమ్మవారి గుడిలో పెట్టిన కాయిన్ పడిపోతే ఆ కోరిక నెరవేరదని ఒకవేళ కాయిన్ నిలబడితే తప్పకుండా కోరిక నెరవేరుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. అలా ప్రియాంక కూడా తన మనసులోని మాటని అమ్మవారికి చెప్పి రూపాయి కాయిన్ నిలబెట్టింది. ఆ రూపాయి కాయిన్ పడిపోకుండా నిలబడే ఉండటంతో అమ్మవారి అనుగ్రహం లభించింది అనుకుని వెంటనే ముంబై వెళ్లి ఆపరేషన్ చేయించుకుని ట్రాన్స్ జెండర్‌గా మారానని చెప్పింది. ఆపరేషన్ డబ్బుల కోసం కూడా తాను చాలా కష్టాలు పడిందని తెలిపింది.