Allu Arjun-Dhanush: బ్లాస్టింగ్ అప్డేట్.. బన్నీతో ధనుష్ భారీ మల్టీస్టారర్?

బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. క్రేజీ హీరోలను..

Allu Arjun-Dhanush: బ్లాస్టింగ్ అప్డేట్.. బన్నీతో ధనుష్ భారీ మల్టీస్టారర్?

Allu Arjun Dhanush

Allu Arjun-Dhanush: బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. క్రేజీ హీరోలను ఒకే తెరపై చూడాలని కలలుగానే అభిమానులను ఒకచోట చేర్చితే ఆ బొమ్మ బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే. అందుకే మేకర్స్ ఇప్పుడు ఇలా హీరోలను కలిపే పనిలో ఉన్నారు. అయితే.. అందుకు అసలైన ఆయుధం కథ. ఆ కథ దొరికితే హీరోలు కూడా సై అంటున్నారు. లేకపోతే నై అంటున్నారు.

అలా రాజామౌళి బ్రాండ్ సినిమాగా ప్రస్తుతం థియేటర్లలో ఉన్న క్రేజీ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ హవా నడుస్తుండగానే ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్ సినిమా సెట్టయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. తమిళ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు తెలుగు సినిమాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్న ధనుష్.. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాకి సై అన్నట్లు తెలుస్తుంది.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ పుష్ప 2తో దాన్ని పదిలం చేసుకోవాలని చూస్తున్నాడు. ఆ తర్వాత కూడా ఎలాగూ పాన్ ఇండియా స్థాయి సినిమాలతోనే కెరీర్ ప్లాన్ చేసుకుంటారు. కాగా, కొరటాల శివ దర్శకత్వంలో ధనుష్-అల్లు అర్జున్ హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్ సినిమాకు బీజం పడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేయనున్న కొరటాల ఆ సినిమా తర్వాత ఈ మల్టీస్టారర్ సినిమాను పట్టాలెక్కించనున్నాడట. ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.