Shiva Thakre : వరుసగా బయటపడుతున్న మగవారిపై కాస్టింగ్ కౌచ్‌లు.. అర్ధరాత్రి బిల్డింగ్‌కి రమ్మంది అంటూ నోరు విప్పిన మరో నటుడు..

తాజాగా మరో నటుడు నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితుడిని అంటూ కామెంట్స్ చేశాడు. బాలీవుడ్ నటుడు, ఇటీవల హిందీ బిగ్‌బాస్‌ 16తో పేరు తెచ్చుకున్న శివఠాక్రే కాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్ చేశాడు. బిగ్ బాస్ ఫేమ్ తో ఇప్పుడిప్పుడే అవకాశాలు తెచ్చుకుంటున్న శివఠాక్రే తాజాగా........................

Shiva Thakre : వరుసగా బయటపడుతున్న మగవారిపై కాస్టింగ్ కౌచ్‌లు.. అర్ధరాత్రి బిల్డింగ్‌కి రమ్మంది అంటూ నోరు విప్పిన మరో నటుడు..

Bollywood Actor Shiva Thakre comments on Casting Couch on boys

Shiva Thakre :  మీటూ కామెంట్స్, కాస్టింగ్ కౌచ్(Casting Couch) కామెంట్స్ సినీ పరిశ్రమలో ఎక్కువగా అమ్మాయిలే వీటి గురించి మాట్లాడతారు. కానీ ఒక్కోసారి అబ్బాయిలకు కూడా ఈ కాస్టింగ్ కౌచ్ సమస్య ఎదురైనా కొంతమంది చెప్పుకోలేరు. ఇటీవల ప్రముఖ నటుడు, ఎంపీ రవికిషన్(Ravikishan) కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్(Bollywood) లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రవికిషన్ మాట్లాడుతూ.. నన్ను కూడా కాస్టింగ్ కౌచ్ చేశారు. ఒక ఆవిడ నాకు రాత్రికి కాఫీ ఆఫర్ చేసి రమ్మంది. ఆమె అప్పుడు మాట్లాడిన మాటలు, చెప్పే విధానం నాకు అర్థమైంది. ఇప్పుడు ఆమె చాలా పెద్ద బిగ్ షాట్ అయింది. ఆమె పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు అని అన్నారు. దీంతో రవికిషన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

తాజాగా మరో నటుడు నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితుడిని అంటూ కామెంట్స్ చేశాడు. బాలీవుడ్ నటుడు, ఇటీవల హిందీ బిగ్‌బాస్‌ 16తో పేరు తెచ్చుకున్న శివఠాక్రే కాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్ చేశాడు. బిగ్ బాస్ ఫేమ్ తో ఇప్పుడిప్పుడే అవకాశాలు తెచ్చుకుంటున్న శివఠాక్రే తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ లో అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా సమస్యలు ఉంటాయని నాకు అర్థమైంది. ఒకసారి నేను ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఓ డైరెక్టర్ ఆడిషన్ అయ్యాక మసాజ్ సెంటర్ కి రా, నీతో పని ఉంది అని చెప్పాడు. నాకు అలాంటి పని చేయడం ఇష్టం లేదు అందుకే నేను అక్కడి నుంచి వచ్చేశాను.

మరోసారి నేను సినీ రంగంలో ఛాన్సుల కోసం కష్టపడుతుంటే ఓ మహిళ అర్ధరాత్రి 11 గంటలకు నన్ను ఆడిషన్ కి రమ్మంది. తన బిల్డింగ్ కి ఆడిషన్ కి రమ్మంది. తను చాలా మందిని స్టార్స్ చేసిందని, నేను కూడా వస్తే నన్ను కూడా స్టార్ చేస్తానంది. తాను చెప్పేది నాకు అర్థమయి నేను సీరియస్ గా రానని చెప్పడంతో నీకు ఇండస్ట్రీలో పని చేయాలని లేదా? నువ్వు రాత్రికి రాకపోతే నీకు పని దొరకదు ఇక్కడ అని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అయినా నేను వెళ్ళలేదు అని తెలిపాడు. ఇలాంటివే మరికొన్ని సంఘటనలు కూడా ఎదుర్కొన్నాను అని శివఠాక్రే చెప్పడంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కూడా బాలీవుడ్ లో వైరల్ గా మారాయి.

Manoj Vs Vishnu : మనోజ్ తో గొడవని షేర్ చేసిన మంచు విష్ణు.. ఇది ఆరంభం మాత్రమే.. మున్ముందు చూడండి అంటూ సీరియస్ పోస్ట్..

మొన్న రవికిషన్, ఇప్పుడు శివఠాక్రే ఇలా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటంతో అబ్బాయిల సమస్యలు కూడా బయటకి వస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంకా ఎవరైనా అబ్బాయిలు తాము ఎదుర్కున్న కాస్టింగ్ కౌచ్ సమస్యలని బయట పెడతారేమో చూడాలి.