Mahima Chaudary : క్యాన్సర్ బారిన హీరోయిన్.. కన్నీళ్లు పెడుతూ వీడియో..

మహిమ చౌదరి మాట్లాడుతూ.. ''నేను ఒకసారి సాధారణ చెకప్‌ కోసం వెళ్లగా క్యాన్సర్‌ బయటపడింది. నాకు ఎలాంటి క్యాన్సర్‌ లక్షణాలు కనిపించలేదు. ​కానీ మళ్ళీ క్లారిటీ కోసం క్యాన్సర్ చెకప్‌.............................

Mahima Chaudary : క్యాన్సర్ బారిన హీరోయిన్.. కన్నీళ్లు పెడుతూ వీడియో..

Mahima Chaudary

Mahima Chaudary :   ప్రముఖ బాలీవుడ్ నటి మహిమ చౌదరి క్యాన్సర్‌ బారిన పడింది. తాజాగా ఈ సంఘటన ప్రముఖ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అనుపమ్ ఖేర్ ఓ వీడియోని షేర్ చేశాడు. ఈ వీడియోలో మహిమ చౌదరి మాట్లాడుతూ తన క్యాన్సర్ అనుభవాలని షేర్ చేసుకుంది. అనుపమ్ ఖేర్ ఈ వీడియో పోస్ట్ షేర్ చేస్తూ.. ఒక నెల రోజుల క్రితం ఓ సినిమాలో క్యారెక్టర్ కోసం మహిమకి కాల్ చేస్తే ఈ విషయం తెలిసింది. తను బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతుందని, తను హాస్పిటల్‌ బెడ్‌పై ఉందని, తన చుట్టూ డాక్టర్లు, నర్సులు ఉన్నారని, జుట్టు పూర్తిగా పోయిందని తెలిపింది. తనకి ఎన్నో ఛాన్సులు వచ్చాయి కానీ క్యాన్సర్ వల్ల నటించలేకపోతుంది అని పోస్ట్ చేశారు.

Nayan-Vignesh : నయన్-విగ్నేష్ పెళ్ళికి తరలి వచ్చిన సూపర్ స్టార్లు..

 

ఇక వీడియోలో మహిమ చౌదరి మాట్లాడుతూ.. ”నేను ఒకసారి సాధారణ చెకప్‌ కోసం వెళ్లగా క్యాన్సర్‌ బయటపడింది. నాకు ఎలాంటి క్యాన్సర్‌ లక్షణాలు కనిపించలేదు. ​కానీ మళ్ళీ క్లారిటీ కోసం క్యాన్సర్ చెకప్‌ చేయించుకున్నాను. అయితే టెస్ట్ చేసిన డాక్టర్లు ఇది క్యాన్సర్‌ కణతి అని చెప్పారు. వాళ్ళు అప్పుడే ఆపరేషన్ చేసి తీసేస్తామంటే నేనే వద్దు అన్నాను. కానీ తర్వాత సీరియస్ గా ఎఫెక్ట్ అయింది. ఆ తర్వాత కీమో థెరపీ చికిత్స చేయించుకున్నాను. ఆ సమయంలో చాలా నీరసమయిపోయాను. ఎనర్జీ లాస్‌ అయ్యాను. నా హెయిర్‌ కూడా పోయింది. కానీ ధైర్యంతో చికిత్స తీసుకున్నాను. ప్రస్తుతం క్యాన్సర్ తగ్గుముఖంలో ఉంది. ఇప్పుడు ఇంటి వద్దే ఉంది మందులు తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటున్నాను. త్వరలోనే మీ ముందుకు మళ్ళీ వస్తాను” అని తెలిపింది.

View this post on Instagram

A post shared by Anupam Kher (@anupampkher)