Nayan-Vignesh : నయన్-విగ్నేష్ పెళ్ళికి తరలి వచ్చిన సూపర్ స్టార్లు..

నయన్-విగ్నేష్ పెళ్ళికి సూపర్ స్టార్లు సైతం తరలి వచ్చారు. సూపర్ స్టార్ రజినీకాంత్, బాద్షా షారుఖ్ ఖాన్, కార్తీ, అట్లీ, బోనీ కపూర్, విజయ్ సేతుపతి, గౌతమీనన్, డైరెక్టర్ మోహనరాజా..........

Nayan-Vignesh : నయన్-విగ్నేష్ పెళ్ళికి తరలి వచ్చిన సూపర్ స్టార్లు..

Nayan Wedding

Nayan-Vignesh :  గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయనతార-విగ్నేష్ శివన్ ఒక్కటయ్యారు. కొన్నేళ్లుగా చేతిలో చెయ్యేసి గుళ్ళు, గోపురాలు తిరిగేస్తున్న ఈ కోలీవుడ్ కపుల్ గురువారం ఉదయం హిందూ సంప్రదాయపద్ధతిలో అగ్నిసాక్షిగా, మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తమిళనాడు మహాబలిపురంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలు, సన్నిహితులు, పలువురు సెలబ్రిటీల మధ్య వీరి వివాహం జరిగింది.

Nayan-Vignesh : నేను, నయన్ ఒక్కటయ్యాం..

పెళ్లి ఫోటోలు ఇంకా బయటకి రానివ్వలేదు. కానీ మీడియా కల్యాణ మండపం బయట పెళ్ళికి వెళ్లే వాళ్ళని కవర్ చేయడానికి ప్రయత్నించింది. నయన్-విగ్నేష్ పెళ్ళికి సూపర్ స్టార్లు సైతం తరలి వచ్చారు. సూపర్ స్టార్ రజినీకాంత్, బాద్షా షారుఖ్ ఖాన్, కార్తీ, అట్లీ, బోనీ కపూర్, విజయ్ సేతుపతి, గౌతమీనన్, డైరెక్టర్ మోహనరాజా… ఇంకా పలువురు సౌత్ సెలబ్రిటీలు నయన్ -విగ్నేష్ వివాహానికి హాజరయ్యారు.