Big B కష్టాలు : అమితాబ్ బచ్చన్ కారు అమ్మేశాడట 

బాలీవుడ్ బిగ్ బికే కష్టాలా? బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ కు వచ్చిన ఆ పెద్ద కష్టం ఏమిటో.. తన లగ్జరీ కారు ఎందుకు అమ్మేయాల్సి వచ్చిందో.. చాలామంది మదిని తొలిచే ప్రశ్న. అమితాబ్ తన లగ్జరీ రాల్స్ రాయిస్ ఫాంటామ్ కారును అమ్మేశారట.

  • Published By: sreehari ,Published On : March 7, 2019 / 08:20 AM IST
Big B కష్టాలు : అమితాబ్ బచ్చన్ కారు అమ్మేశాడట 

బాలీవుడ్ బిగ్ బికే కష్టాలా? బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ కు వచ్చిన ఆ పెద్ద కష్టం ఏమిటో.. తన లగ్జరీ కారు ఎందుకు అమ్మేయాల్సి వచ్చిందో.. చాలామంది మదిని తొలిచే ప్రశ్న. అమితాబ్ తన లగ్జరీ రాల్స్ రాయిస్ ఫాంటామ్ కారును అమ్మేశారట.

బాలీవుడ్ బిగ్ బికే కష్టాలా? బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ కు వచ్చిన ఆ పెద్ద కష్టం ఏమిటో.. తన లగ్జరీ కారు ఎందుకు అమ్మేయాల్సి వచ్చిందో.. చాలామంది మదిని తొలిచే ప్రశ్న. అమితాబ్ తన లగ్జరీ రాల్స్ రాయిస్ ఫాంటామ్ కారును అమ్మేశారట. అమితాబ్ తన కారును ఎంతకు అమ్మారో ధరను వెల్లడించలేదు. ఈ లగ్జరీ రాయిస్ కారును బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ విందు వినోద్ చోప్రా అమితాబ్ కు గిఫ్ట్ గా ఇచ్చారు.

అమితాబ్, వినోద్ చోప్రా కాంబినేషన్ లో 2007లో ఏకలవ్య చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి వినోద్ చోప్రా దర్శకుడిగా పనిచేయగా.. అమితాబ్ లీడ్ రోల్ పోషించారు. 2007, ఫిబ్రవరి 16వ తేదీన ‘ఏకలవ్య ది రాయల్ గార్డ్’ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్స్ ఆఫీసు రికార్డులు బ్రేక్ చేసింది. అంతేకాదు.. ఆ ఏడాదిలో బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీ కింద ఆస్కార్ కు కూడా నామినేట్ అయింది.
Also Read : హీరో విజయ్ ప్రేమంటే ఇదే : స్టంట్స్ వద్దంటూ ఫ్యాన్స్‌కు వేడుకోలు

ఈ చిత్రం విజయం సాధించిన సందర్భంగా అమితాబ్ బచ్చన్ కు వినోద్ చోప్రా ఈ లగ్జరీ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. కారు గిఫ్ట్ గా ఇచ్చిన అనంతరం అమితాబ్ కారు పక్కన దిగిన ఫొటో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. అమితాబ్ కారును ఓ వ్యాపారవేత్త రూ.3.5 కోట్లకు కొనేసినట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం.

అమితాబ్ కు ఫ్యాన్సీ కార్లంటే ఎంతో ఇష్టం. ఇప్పటికే బచ్చన్ కు మెర్సిడెజ్ ఎస్-క్లాస్, రేంజ్ రోవర్, బెంట్లీ జీటీ, లెక్సస్ SUV లగ్జరీ కార్లు ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ తో పాటు బాలీవుడ్ సెలబ్రటీల్లో చాలామందికి రోల్స్ రాయిస్ కారు ఉంది. వారిలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, షాహిద్ కపూర్ ఉన్నారు.  

అమితాబ్ నటించిన చివరి చిత్రం థంగ్స్ ఆఫ్ హిందుస్థాన్. ఈ చిత్రంలో అమిర్ ఖాన్ లీడ్ రోల్ పోషించాడు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ మరో కొత్త చిత్రం బాద్లాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ లో బచన్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో అమితాబ్ తో పాటు నటి తాప్సీ పన్ను నటిస్తోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై  ఈ చిత్రానికి షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  
Also Read : ఆల్ ఇన్ వన్ : వాట్సాప్ తరహాలో ఫేస్ బుక్ ప్రైవసీ ప్లాట్ ఫాం