Naseeruddin Shah : సినిమా అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు.. అవార్డులని నా బాత్రూం హ్యాండిల్స్‌గా వాడతాను అంటూ..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నసీరుద్దీన్ షా మాట్లాడుతూ సినిమా అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bollywood Senior Actor Naseeruddin Shah Sensational comments on Movie Awards
Naseeruddin Shah : బాలీవుడ్(Bollywood) స్టార్ యాక్టర్ నసీరుద్దీన్ షా ఒకప్పుడు హీరోగా, విలన్ సినిమాలు చేసి ప్రస్తుతం 72 ఏళ్ళ వయసులో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. దాదాపు 40 ఏళ్లకు పైగా కెరీర్ ఉన్న నసీరుద్దీన్ షా తన కెరీర్ లో ఎన్నో అవార్డులను అందుకున్నారు. స్టేట్, నేషనల్ అవార్డులు, కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులను కూడా అందుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నసీరుద్దీన్ షా మాట్లాడుతూ సినిమా అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నసీరుద్దీన్ షా మాట్లాడుతూ,, ఒకపాత్ర కోసం ఎంతవరకైనా కష్టపడేవాడు గొప్ప నటుడు అవుతాడు. అంతేకాని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది నటుల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకొని అతన్ని ఉత్తమ నటుడు అని ఎవరో ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్ అని భావిస్తాను. అవార్డులు చూసి నేనేమి పొంగిపోను. ఇటీవల నాకు ప్రకటించిన రెండు అవార్డులను తీసుకోవడానికి కూడా వెళ్ళలేదు. కెరీర్ ఆరంభంలో అవార్డులు వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఆ తర్వాత వాటి గురించి తెలుసుకున్నాక అవార్డుల మీద ఆసక్తి పోయింది. ఫిలింఫేర్ అని, ఇంకా ఏవేవో పేర్లతో అవార్డులు ఇస్తారు. వాటిల్లో నాకేమి గొప్ప కనిపించట్లేదు అని అన్నారు.
Bro Movie : పవన్, తేజ్ ‘బ్రో’ సినిమాలో బాలీవుడ్ భామతో స్పెషల్ సాంగ్? ఒరిజినల్ వర్షన్‌లో లేకపోయినా..
అలాగే తనకి వచ్చిన అవార్డులపై మాట్లాడుతూ.. ఇప్పటికే నాకు చాలా అవార్డులు వచ్చాయి. ఒకవేళ నేను ఫామ్ హౌస్ కట్టుకుంటే దాంట్లో బాత్రూమ్స్ కి హ్యాండిల్స్ గా అవార్డులను పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు వాష్ రూమ్ కి వెళ్లేవాళ్లంతా ఆ అవార్డులని పట్టుకుంటారు, అంటే ఆ అవార్డులు వాళ్లకి కూడా వచ్చినట్టే కదా. అవార్డుల్లో చాలావరకు లాబీయింగ్ తోనే వస్తాయి. కానీ నాకు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందుకున్నప్పుడు మాత్రం సంతోషించాను. అది చూసి పైనున్న మా నాన్న సంతోషిస్తాడని భావించాను అన్నారు. దీంతో నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనంగా మారాయి. మరి దీనిపై ఎవరైనా కామెంట్స్ చేస్తారేమో చూడాలి.