స్టెప్స్ బాగా వేశారు.. వార్నర్‌కు బన్నీ థ్యాంక్స్..

‘బుట్టబొమ్మ’ టిక్ టాక్ చేసిన వార్నర్‌కు అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు..

  • Published By: sekhar ,Published On : April 30, 2020 / 10:50 AM IST
స్టెప్స్ బాగా వేశారు.. వార్నర్‌కు బన్నీ థ్యాంక్స్..

‘బుట్టబొమ్మ’ టిక్ టాక్ చేసిన వార్నర్‌కు అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు..

‘బుట్టబొమ్మ.. బుట్టబొమ్మా.. నన్నుసుట్టూకుంటివే.. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టూకుంటివే’.. సామాన్యుల దగ్గరి నుండి సెలబ్రిటీల వరకు అందరూ ఈ పాటకు ఫిదా అయిపోయారు. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ బుట్టబొమ్మ సాంగ్‌కు స్టెప్స్ వేశాడు. 

వార్నర్, తన భార్య క్యాండిస్‌తో కలిసి ‘బుట్టబొమ్మ’ సాంగ్‌కి స్టెప్పులేశాడు. భార్య భర్తలిద్దరూ నవ్వుతూ బ్యూటిఫుల్ మూమెంట్స్ చేశారు. వాళ్లు డ్యాన్స్ చేస్తుండగా బ్యాగ్రౌండ్‌లో బుడ్డది కూడా హడావిడి చేసింది. వార్నర్ పోస్ట్ చేసిన ఈ పాట ఇప్పుడు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

తాజాగా ఈ వీడియో గురించి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందించాడు. ‘ఇది నిజంగా అభినందించాల్సిన విషయం. థ్యాంక్యూ వెరీ మచ్‌‌’ అంటూ ట్వీట్‌ చేశాడు బన్నీ. ఇక గీతా ఆర్ట్స్‌ కూడా వార్నర్‌-క్యాండిస్‌ల డ్యాన్స్‌ వీడియోను తమ అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‘బుట్టబొమ్మ’ పాట సరిహద్దులను చెరిపివేసిందంటూ ట్వీట్‌ చేసింది. థమన్ కూడా ఈ వీడియోను షేర్ చేశాడు. ‘బుట్టబొమ్మ బ్రేక్స్ ది బోర్డర్’ అంటూ పలువురు మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ని ప్రశంసిస్తున్నారు.