నటి సురేఖా వాణి భర్త కన్నుమూత

సురేఖా వాణి భర్త సురేష్ తేజ కన్నుమూసారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్, మే 6న తుదిశ్వాస విడిచారు. ఆయన పలు టీవీ షోలకు డైరెక్టర్‌గా వర్క్ చేసారు..

  • Published By: sekhar ,Published On : May 6, 2019 / 10:41 AM IST
నటి సురేఖా వాణి భర్త కన్నుమూత

సురేఖా వాణి భర్త సురేష్ తేజ కన్నుమూసారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్, మే 6న తుదిశ్వాస విడిచారు. ఆయన పలు టీవీ షోలకు డైరెక్టర్‌గా వర్క్ చేసారు..

ఎన్నో తెలుగు సినిమాల్లో తల్లి, సిస్టర్, వైఫ్ క్యారెక్టర్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి సురేఖా వాణి. ఇప్పుడు ఆమె ఇంట విషాదం నెలకొంది. సురేఖా వాణి భర్త సురేష్ తేజ చనిపోయారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్.. మే 6న ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన చాలా టీవీ షోలకు డైరెక్టర్‌గా పని చేశారు. 

ఆయన డైరెక్ట్ చేసే షోలకు సురేఖ యాంకరింగ్ చేసేది. అలా వీరిద్దరి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ పెళ్ళి చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి మరీ పెళ్ళి చేసుకున్న సురేష్, సురేఖలకు ఒక పాప ఉంది.  సురేష్ మరణ వార్త తెలియగానే సినీ, టీవీ రంగానికి చెందిన పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ సంతాపం తెలిపారు.