మెట్రోలో జర్నీచేస్తూ సినిమాలు చూడొచ్చు…డౌన్ లోడ్ కూడా!

చెన్నై మెట్రోలో ప్రయాణికులు ఫ్రీగా సీరియల్స్, సినిమాలు చూడొచ్చు..

  • Published By: sekhar ,Published On : February 26, 2020 / 09:58 AM IST
మెట్రోలో జర్నీచేస్తూ సినిమాలు చూడొచ్చు…డౌన్ లోడ్ కూడా!

చెన్నై మెట్రోలో ప్రయాణికులు ఫ్రీగా సీరియల్స్, సినిమాలు చూడొచ్చు..

చెన్నై : ఇకనుండి మెట్రో రైల్లో ఎంచక్కా సినిమాలు చూడొచ్చు.. మీకు నచ్చిన సినిమాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రయాణికులు క్లోజ్డ్ లూప్ వైఫై (closed loop WiFi)  సదుపాయం ద్వారా కంటెంట్‌ను ఉచితంగా చూడటానికి లేదా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ‘ఇన్-ట్రైన్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ‘షుగర్‌బాక్స్’ ఈ వారం నుంచి ప్రారంభం కానుందని Chennai Metro Rail Limited (CMRL) వర్గాలు తెలిపాయి.

మెట్రోలో జర్నీ చేసేవారు ముందుగా ‘షుగర్‌బాక్స్’ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, రిజిస్టర్ చేసుకోవాలి. టీవీ సీరియల్స్ నుండి సినిమాల వరకు చక్కగా చూసుకోవచ్చు. ఇంగ్లీష్, తమిళ్, హిందీ వంటి భాషల్లో కంటెంట్ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ద్వారా ఓ సినిమాను కేవలం పదినిమిషాల్లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నెట్ వర్క్ అంత స్పీడ్‌గా ఉంటుందట.

చెన్నై నగరంలో 45 కిలోమీటర్ల మెట్రో మార్గంలో సగటున రోజుకి 1.15 లక్షలమంది ప్రయాణిస్తున్నారని అంచనా.. మరికొద్ది రోజుల్లో ‘షుగర్‌బాక్స్’ తమిళ ప్రజలకు అందుబాటులోకి వస్తోంది. రానున్న రోజుల్లో ఇతర ప్రాంతాల్లోనూ ‘షుగర్‌బాక్స్’ పక్రియ ఏర్పాటుచేసే ఆలోచన ఉన్నట్టు అధికారులు తెలిపారు.