Chiranjeevi : అభిమాని కూతురి పెళ్ళికి మెగాస్టార్ సాయం..

తాజాగా చిరంజీవి ఓ వీరాభిమాని కూతురి పెళ్ళికి ఆర్థిక సహాయం చేశారు. రాజం కొండలరావు అనే ఓ వీరాభిమాని చాలా సంవత్సరాలుగా చిరంజీవి చేపట్టిన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అఖిల భారత...

Chiranjeevi : అభిమాని కూతురి పెళ్ళికి మెగాస్టార్ సాయం..

Chiranjeevi

Chiranjeevi :  మెగాస్టార్‌ చిరంజీవి సినిమాల్లోనే హీరో కాదు నిజ జీవితంలో కూడా గొప్ప హీరో అని అందరికి తెలుసు. చిరంజీవి ఐ, బ్లడ్ బ్యాంక్ తో ఎంతో మందికి ప్రాణ దానం చేశారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని సంవత్సరాలుగా ఎంతో మందికి సేవలనందిస్తున్నారు. అంతే కాక తన వద్దకు ఎవరు సాయమంటూ వచ్చినా లేదనకుండా చేస్తారు చిరంజీవి. సినీ పరిశ్రమలోని సమస్యల పరిష్కారాల కోసం కూడా ఆయన పోరాడుతున్నారు. ఇక ఆయన అభిమానుల కోసం సేవ చేయడానికి ముందుంటారు. తాజాగా చిరంజీవి ఓ వీరాభిమాని కూతురి పెళ్ళికి ఆర్థిక సహాయం చేశారు.

 

రాజం కొండలరావు అనే ఓ వీరాభిమాని చాలా సంవత్సరాలుగా చిరంజీవి చేపట్టిన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అఖిల భారత చిరంజీవి యువత తరపున కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటూ సేవలందించారు. గతంలో ఈయన చాలా సార్లు మెగాస్టార్ ని కలిశారు. ఇటీవల ఆయన కూతురు నీలవేణికి పెళ్లి కుదిరింది. ప్రస్తుతం ఆయన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఈ విషయాన్ని అఖిల భారత చిరంజీవి యువత మెగాస్టార్ వద్దకు తీసుకెళ్లారు.

Aishwaryaa : ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య కరోనాతో హాస్పిటల్‌లో

ఈ విషయం తెలిసిన చిరంజీవి వెంటనే కొండలరావుకి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఈ విషయాన్ని అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ”అంతేకాక మెగాస్టార్ బాటలోనే నడిచే అభిమానులమైన మేం కూడా పెళ్లికూతురికి అభినందనలతో పాటూ హితోదికంగా ఆర్థికంగా మరో లక్ష రూపాయలు చేయూతనందించడం మాకు అందరికి ఆనందంగా ఉంది. ఈ కొత్త జంటను ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము అని పోస్ట్ చేశారు.