Chiranjeevi – Pawan Kalyan : శరత్ బాబుకి చిరంజీవి, పవన్ కళ్యాణ్ నివాళులు.. వెండితెర జమిందార్ శరత్ బాబు!

శరత్ బాబు మరణానికి చింతిస్తూ మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు.

Chiranjeevi – Pawan Kalyan : శరత్ బాబుకి చిరంజీవి, పవన్ కళ్యాణ్ నివాళులు.. వెండితెర జమిందార్ శరత్ బాబు!

Chiranjeevi Pawan Kalyan condolence on sudden demise of sarath babu

Sarath Babu : టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతూ వస్తున్నారు. ఏప్రిల్ 21 నాడు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ (AIG) ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ఆయన.. ఐసీయూలో చికిత్స పొందుతూ వస్తున్నారు. అయితే మల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడంతో నేడు (మే 22) అయన మృతి తుది శ్వాస విడిచారు. ఆయన అకాల మరణం సినీ ప్రముఖులను, ప్రేక్షకులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఇక ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

Balakrishna : శరత్ బాబుకి బాలకృష్ణ నివాళులు.. ఆయనతో కలసి పని చేయడం!

చిరంజీవి..

“వెండితెర జమిందార్ ప్రముఖ నటుడు శరత్ బాబు గారి మరణ వార్త కలచివేసింది. అందం హుందాతనం ఉట్టిపడే తన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న శ్రీ శరత్ బాబు గారితో నాకు ఎంతో అనుబంధం వుంది. అనేక చిత్రాలలో ఆయన నా సహనటుడుగా ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులందరికీ నా ప్రగాఢ సంతాపం” అని ట్వీట్ చేశాడు. కాగా చిరంజీవి, శరత్ బాబు ఆపద్బాంధవుడు, అన్నయ్య, శంకర్ దాదా జిందాబాద్, 47 రోజులు వంటి సినిమాల్లో కలిసి నటించారు.

Sarath Babu : శరత్ బాబు, రమాప్రభల కథ ఏంటి.. పెళ్లి అయిందా? సహజీవనమా?

పవన్ కళ్యాణ్..

“ప్రముఖ నటులు శ్రీ శరత్ బాబు గారు తుది శ్వాస విడిచారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ శరత్ బాబు గారు కోలుకుంటారు అనుకున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. శ్రీ శరత్ బాబు గారితో నాకు చెన్నైలో చిత్ర పరిశ్రమ ఉన్న రోజుల నుంచీ పరిచయం ఉంది. నా మొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’లో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ‘వకీల్ సాబ్’ చిత్రంలోనూ నటించారు. తెలుగు చిత్రాల్లో ఆయన తనదైన నటనను చూపించారు. కథానాయకుడిగానే కాదు సహాయ పాత్రల్లో, ప్రతినాయక పాత్రల్లో విభిన్న భావోద్వేగాలు పలికించారు. ఆయన మరణంతో చిత్ర సీమకు ఓ మంచి నటుడు దూరమయ్యారు. శ్రీ శరత్ బాబు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు.