Megastar : చిరంజీవి.. త్రిష.. మరోసారి? | Chiranjeevi Trisha act together again

Megastar : చిరంజీవి.. త్రిష.. మరోసారి?

ఇటీవల చిరంజీవి కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమాని అనౌన్స్ చేశారు. 'ఆర్ఆర్ఆర్' నిర్మాత డివివి దానయ్య నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా......

Megastar : చిరంజీవి.. త్రిష.. మరోసారి?

 

Chiranjeevi :  మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దాదాపు 7 సినిమాలు ఓకే చేశారు చిరంజీవి. అందులో ఒకటి రిలీజ్ కు రెడీగా ఉండగా, మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మిగిలిన సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఇలా కుర్ర హీరోలకి పోటీగా చాలా ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. అంతే ఫాస్ట్ గా అప్ డేట్స్ కూడా ఇస్తున్నారు. తాజాగా చిరంజీవి సినిమాల నుంచి మరో అప్ డేట్ వినిపిస్తుంది.

 

ఇటీవల చిరంజీవి కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమాని అనౌన్స్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్య నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల సీనియర్ హీరోల సరసన సీనియర్ హీరోయిన్స్ నే ఎంపిక చేస్తున్నారు. దీంతో వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగాస్టార్ సినిమాలో త్రిషని కథానాయికగా ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్

ఇదే నిజమైతే కనుక త్రిష చిరంజీవి కలిసి రెండోసారి నటించబోతున్నట్టే. గతంలో వీరిద్దరూ కలిసి ‘స్టాలిన్’ సినిమాలో నటించారు. ఈ సినిమా 2006లో వచ్చింది. అంటే దాదాపు 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి నటించబోతున్నారు. కరోనా లేకపోతే చిరు షూటింగ్స్ మరింత ఫాస్ట్ గా అయ్యేవి. కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి. మెగా అభిమానులు చిరంజీవి సినిమాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

×